• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సొంత జిల్లాలోనే..: కిరణ్‌పై విహెచ్, జగన్‌పై ఫైర్

By Pratap
|

VH
బోధన్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుళ్లపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్ జైత్రయాత్ర సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. సొంత జిల్లాలో సోనియా గాంధీకి సమాధి కడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూస్తూ ఉండిపోయారని ఆయన అన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు మంచి రాజకీయవేత్త అని అనుకున్నానని, చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ హైదరాబాదులో సీమాంధ్ర జిల్లాల నుంచి మనుషులను తెచ్చి సమైక్యాంధ్ర అనడం మానుకోవాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు చెందినవారు కనీసం 30 శాతమైనా ఉండాలి కదా, తెలంగాణ వాళ్లు లేకుండా సమైక్యాంధ్ర ఏమిటని ఆయన జగన్‌ను ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని, 41 మంది శాసనసభ్యులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా వద్దకు పంపించారని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల నాయకుడు అశోక్ బాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఇతర ప్రాంతాలవారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. జులై 30వ తేదీన సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాతనే సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైందని ఆయన అన్నారు.

ఇష్టం లేకున్నా కలిసి ఉండాలనడం వ్యభిచారమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సమైక్యవాదం మానసిక వ్యభిచారంలాంటిదని అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ కలిసి ఉండాలని అనడం మానసిక వ్యభిచారమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు రాజయ్య, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MP V Hanumanth rao lashed out at CM Kiran kumar Reddy, Telugudesam party president Nara Chandrababu Naidu and YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more