వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై కేంద్రానికి వీహెచ్ ఫిర్యాదు, రేవంత్‌పై ఏసీబీ హైడ్రామాపై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శనివారం విజ్ఞప్తి చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కొనుగోలు సమయంలో రేవంత్ పలుమార్లు బాస్ అని ప్రస్తావించారని వీహెచ్ చెప్పారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేందుకు ఆధారాలున్నాయని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారని రాజ్‌నాథ్‌కు చెప్పారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ నరసింహన్‌తో చర్చిస్తున్నామని, విచారణ సక్రమంగా సాగేలా చూస్తానని రాజ్‌నాథ్ తెలిపారు.

మరోవైపు రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు తొలిరోజు అయిన శనివారం విచారించారు. తొలుత హైడ్రామా నడిచింది. అనంతరం మధ్యాహ్నం అతనిని ఏసీబీ కార్యాలయానికి తీసుకు వెళ్లి గంటకు పైగా విచారించారు. ఆదివారం రెండోరోజు కూడా కస్టడీకి తీసుకున్నారు.

వీహెచ్

వీహెచ్

రేవంత్ రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శనివారం విజ్ఞప్తి చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

శనివారం ఉదయం 9.15 గంటలకు ఎ2, ఎ3 ఇద్దరు నిందితులను ఎసిబి అధికారులు కస్టడికి తీసుకుని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. రేవంత్ రెడ్డిని వారితోపాటు తరలించలేదు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ న్యాయవాదులు ఉదయాన్నే ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తీరా పోలీసులు తీసుకువచ్చిన వారిలో రేవంత్‌రెడ్డి లేకపోవడం, ఆయన ఎక్కడున్నది ఏసీబీ నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో న్యాయవాదులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రమోద్ రెడ్డి బయట మీడియాతో మాట్లాడుతూ... కోర్టు ఆదేశాలను ఏసీబీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. రేవంత్ ఎక్కడున్నరన్న దానిపై సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. అనంతరం ఇదే విషయమై రేవంత్ న్యాయవాదులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఏసీబీ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్‌ని ఆలస్యంగా తీసుకెళ్లడంపై సమాధానమివ్వాల్సిందిగా కోర్టు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. ఇలా ఉండగా కేసుకు సంబంధించి ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షల నగదు, ఓ ఐ ఫోన్, ఆడియో రికార్డర్లను కోర్టుకు సమర్పించారు. కాగా, రేవంత్ కస్టడిని తగ్గించాలని కోరుతూ న్యాయవాదులు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను సోమవారానికి వాయిదావేసింది.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్‌కు కనీస సదుపాయాలు కల్పించడంలేదని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కనీసం బ్రెష్ చేసుకోనివ్వడం లేదని, డ్రెస్ కూడా మార్చుకోనివ్వకుండా తొందరపెడుతున్నారని న్యాయవాది ఆరోపించారు.

English summary
VH MEMORANDUM TO Rajnath Singh on Revanth issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X