v hanumantha rao gandra venkataramana reddy manda jagannadham warangal mahaboobnagar వి హనుమంత రావు గండ్ర వెంకటరమణ రెడ్డి మందా జగన్నాథం వరంగల్ మహబూబ్ నగర్
ఆంధ్రా నేతల వ్యాఖ్య నిజం చేస్తున్నావ్: కెసిఆర్‌పై విహెచ్

విద్యార్థులు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితితో కెసిఆర్ విలీనంపై చర్చించాలని సూచించారు. కెసిఆర్ మాట తప్పి ఆంధ్రా నేతల వ్యాఖ్యలు నిజం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ క్రెడిట్ కాంగ్రెసు పార్టీకే దక్కుతుందని వి హనుమంత రావు ఈ సందర్భంగా అన్నారు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని అందరూ భావిస్తున్నారన్నారు. అమరవీరుల వల్లే సాధ్యమైందని చెప్పారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: గండ్ర
కెసిఆర్ విలీనంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణ రెడ్డివరంగల్ జిల్లాలో అన్నారు. సోనియా పైన చెసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికార పక్షంలో ఉంటారు.. లేదంటే ప్రతిపక్షంలో ఉంటారన్నారు. అదే సమయంలో జగన్ పైనా మండిపడ్డారు. జగన్ ఏ మొహం పెట్టుకొని రేపు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ప్రశ్నించారు. జగన్ పర్యటిస్తే మానుకోట పునరావృతమవుతుందని హెచ్చరించారు.
తెరాస బలంగా ఉంది: మందా జగన్నాథం
తమ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదని మందా జగన్నాథం మహబూబ్ నగర్లో అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం తెరాసతోనే సాధ్యమన్నారు. తాము పెట్టిన షరతులకు కాంగ్రెసు ఒప్పుకుంటే తాము విలీనానికి సిద్ధమన్నారు. విలీనంపై దిగ్విజయ్, జైరామ్ రమేష్‌లు ఏకపక్షంగా మాట్లాడారన్నారు.