వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరైన వరప్రసాద రావు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పార్కింగ్ సమీపంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించేలోపే ఆయన ప్రాణం విడిచారు. వరప్రసాద్‌ మృతిపై సికింద్రాబాద్‌ గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆయనది హఠాన్మరణమా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలోనే కాదు తెలంగాణలో నమోదైన అగ్రిగోల్డ్‌ కేసులో డైరెక్టర్లకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు తోటి డైరెక్టర్లతో కలిసి సోమవారం సదాశివ వరప్రసాద్‌ వచ్చాడు. స్టేషన్‌లో సంతకం చేసిన తర్వాత అందరూ కలిసి విజయవాడ వచ్చేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్కింగ్ దగ్గరకు రాగానే వరప్రసాద్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందారా ? లేకా మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. అయితే వరప్రసాద్ మృతిపై గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.

శివగిరి క్షేత్రంపై క్షుద్రపూజలు పోలీసుల అదుపులో నిందితులుశివగిరి క్షేత్రంపై క్షుద్రపూజలు పోలీసుల అదుపులో నిందితులు

Vice chairman of Agri Gold Sadasiva varaprasad suspicious death

ఈ కేసులో సదాశివ కూడా కీలక నిందితుడు కావటం, ఆయన మృతి చెందటంతో ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. అగ్రిగోల్డ్‌ స్కామ్‌ ఏపీలో రాజకీయ దుమారం రేపింది. నాలుగు రాష్ట్రాలను కుదిపేసిన అగ్రిగోల్ద్ స్కామ్ కేసుని సిబిఐ విచారణ చేస్తుంది. ఇక చాలా కాలంగా అగ్రిగోల్ద్ బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.ఖాతాదారులకు సకాలంలో డిపాజిట్లు చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది. దాదాపు 13 లక్షల మందిని ఈ సంస్థ నట్టేట ముంచింది. ఇప్పుడు ఈ కేసులో నిందితుడు హఠాన్మరణం షాక్ కు గురి చేస్తుంది.

English summary
Under mysterious circumstances, the vice chairman of Agri-Gold has been found dead. Going by the details, Immadi Sadasiva Varaprasad Rao was coming out of Secunderabad Railway station parking. He collapsed then and there. People who noticed him, did their best in bringing Varaprasad Rao into conscious and as their efforts went vein, they rushed him to the nearest hospital.The doctors who have examined Varaprasad Rao declared him as dead. The police have sent the corpse to post-mortem and then handed it over to the family members. Based on the incident, the police have registered a complaint and are said to be investigating the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X