అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచి స్నేహితుడిని కోల్పోయా: వెంకయ్య, పవన్ సంతాపం, కన్నీటిపర్యంతమైన నిమ్మకూరు

|
Google Oneindia TeluguNews

Recommended Video

నందమూరి హరికృష్ణ మరణంపై పోసాని కృష్ణ మురళి స్పందన

హైదరాబాద్: మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని వారు వ్యాఖ్యానించారు.

మంచి మిత్రుడిని కోల్పోయా..

మంచి మిత్రుడిని కోల్పోయా..

‘మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నాను. ఎన్టీఆర్‌ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

పవన్ సంతాపం.. కార్యక్రమాలు రద్దు

పవన్ సంతాపం.. కార్యక్రమాలు రద్దు

హరికృష్ణ మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని పవన్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం జనసేన పార్టీ అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కన్నీటిపర్యంతమైన నిమ్మకూరు

కన్నీటిపర్యంతమైన నిమ్మకూరు

నల్గొండ జిల్లాలో కారు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ (61) చనిపోవడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆకస్మిక మరణవార్త గ్రామంలో ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ అభిమాన నాయకుడు దుర్మరణం చెందారని తెలిసి నిమ్మకూరు ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

పెద్ద దిక్కును కోల్పోయామంటూ..

పెద్ద దిక్కును కోల్పోయామంటూ..


ఎన్టీఆర్ చైతన్య రథ సారధి హరికృష్ణ ఇక లేరన్న వార్తతో నిద్రలేవాల్సి రావడాన్ని వారిని తీవ్రంగా కలిచి వేస్తోందని గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. తమ గ్రామానికి అండ పోయిందని గ్రామస్తులు కలత చెందారు. ఆయన తండ్రి ఎన్‌టీఆర్‌ మరణంతో కృంగిపోయాం.. ఇపుడికి మరో పెద్ద దిక్కును కోల్పోయామంటూ వారు భోరున విలపించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరినీ పేరు పెట్టి పిలిచే అనుబంధం హరికృష్ణది, ఎన్‌టీఆర్‌ కుటుంబంలో ఈ గ్రామంలో అందరికి తెలిసిన వ్యక్తి ఆయనొక్కడే అని ఆయన బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

నిమ్మకూరుతో విడదీయరాని బంధం

నిమ్మకూరుతో విడదీయరాని బంధం

కాగా, ఎన్టీఆర్‌ తర్వావాత నిమ‍్మకూరు గ్రామంతో హరికృష‍్ణది విడదేయలేని బంధం. సెప్టెంబర్ 2,1956లో నిమ్మకూరులోనే హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాబ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి. హరికృష్ణ భార్య లక్ష్మీది కూడా నిమ్మకూరే. ఎంపీగా, మంత్రిగా ఉన్న సమయంలో స్వస్థలం నిమ్మకూరులో ఆయన పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జానకీ రాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హరికృష్ణ మానసికంగా బాగా కృంగిపోయారనీ, చివరిసారిగా 10నెలల క్రితం కుమారుడు కళ్యాణ్‌రామ్‌తో కలిసి హరికృష్ణ నిమ్మకూరు వచ్చారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

English summary
Vice President Venkaiah Naidu and Janasena president Pawan Kalyan deeply saddened by the death of harikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X