వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతృభాషపై వెంకయ్య మమకారం .. ఏం చెప్పారంటే ....

|
Google Oneindia TeluguNews

మాతృభాషా దినోత్సవం సందర్భంగా అమ్మ భాషపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన మమకారాన్ని చాటి చెప్పారు. ఏ భాష అయిన అనర్గళంగా మాట్లాడే వెంకయ్య నాయుడు తెలుగు పై తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అమ్మ భాషను ప్రేమించడమంటే మిగిలిన భాషలను వదిలేయమని కాదన్నారు. భాషను కాపాడుకోవడం అంటే సొంత సమాజాన్ని కాపాడుకోవడమని గుర్తించాలన్నారు.

జగన్ సైలెన్స్ వెనుక అర్ధం ఏంటి ? రాజకీయ కారణమా ? వ్యూహాత్మక మౌనమా ?జగన్ సైలెన్స్ వెనుక అర్ధం ఏంటి ? రాజకీయ కారణమా ? వ్యూహాత్మక మౌనమా ?

భాషా మాధుర్యాన్ని చాటి చెప్పిన ఆయన ఆనందమైనా, బాధనైనా సొంత భాషలో వ్యక్తీకరించినప్పుడే పరిపూర్ణంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమనీయమైన, రమణీయమైన అందమైన అమ్మ భాషకు ఇప్పుడు కొందరు దూరమవుతున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

Vice President Venkaiah Naidu shows his affection towards mother tongue

ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన ఆయన పర భాషలు ఎన్ని నేర్చుకున్నా, స్వభాష గొప్పతనం మాటలలో చెప్పలేనిది అని కొనియాడారు. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే జరిగేలా చూడాలని చెప్పిన వెంకయ్య నాయుడు ఇందుకు ప్రభుత్వ పరంగా కృషి జరగాలన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ్యులు 22 భాషల్లో మాట్లాడుకునే అవకాశాన్ని తాను కల్పించినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ భాషాభిమానంతో ప్రవర్తించాలని ఆయన సూచించారు.

English summary
Vice President Venkaiah Naidu shows his affection towards mother tongue . Venkayya Naidu, who speaks eloquently in any language, expressed his fondness for Telugu. Speaking at a gathering here on Mother tongue day, the Vice President said that loving the mother language doesn't means leave the other languages. Protecting language means protecting one's own society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X