వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాగ్దాటికి వెంకయ్య మారుపేరు, లోటేనన్న బాబు

బిజెపి అగ్రనేతల్లో వెంకయ్యనాయుడు ఒకరు. కుగ్రామం నుండి అంచెలంచెలుగా బిజెపిలో కీలకనాయకుడిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డిఏ వెంకయ్య పేరును ప్రతిపాదించింది. అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన పలు ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి అగ్రనేతల్లో వెంకయ్యనాయుడు ఒకరు. కుగ్రామం నుండి అంచెలంచెలుగా బిజెపిలో కీలకనాయకుడిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డిఏ వెంకయ్య పేరును ప్రతిపాదించింది. అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు ఆయనను అభినందించారు. వాగ్దాటి వెంకయ్యకు మంచిపేరు తెచ్చిపెట్టింది. తన ప్రసంగంలో 'ప్రాస'తో ఆకట్టుకొంటారు.

5 కి.మీ. నడక, ఇందిరాగాంధీ ప్రచారం చేసినా గెలిచిన వెంకయ్య5 కి.మీ. నడక, ఇందిరాగాంధీ ప్రచారం చేసినా గెలిచిన వెంకయ్య

సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేశారు.

అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఎంపిక కావడంతో ఆయనను పలువురు అభినందనలతో ముంచెత్తారు. ప్రధానమంత్రి మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వెంకయ్యనాయుడును అభినందించారు.

ఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఖరారుచేసిన బిజెపిఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఖరారుచేసిన బిజెపి

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నుండే ఎన్‌‌డిఏ పక్షాలతో బిజెపి నేతలు ఫోన్ చేసి వెంకయ్యనాయుడు పేరును ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికచేసినట్టు చెప్పారు. వారి మద్దతును కోరారు. మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు వెంకయ్యనాయుడు తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

వాగ్దాటికి వెంకయ్య పెట్టింది పేరు

వాగ్దాటికి వెంకయ్య పెట్టింది పేరు

దేశరాజకీయాల్లో పరిచయం లేని పేరు వెంకయ్యనాయుడు. సుదీర్ఘకాలంపాటు బిజెపిలోనే వెంకయ్యనాయుడు కొనసాగారు. విద్యార్థిదశ నుండే ఆయన రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఆంధ్ర యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.వెంకయ్యనాయుడుకు మంచి వాగ్దాటి గల నాయకుడు. తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొంటారు. ఇక తెలుగులోనైతే చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు కూడ ఆయన ప్రసంగాలను వినేందుకు ఆసక్తిని చూపుతారు.

Recommended Video

Pawan Kalyan Seeks Chandrababu Naidu Appointment
వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడు

వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడు

ఎన్‌డియే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపికచేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి అన్నివిధాలుగా అర్హులని చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే ఈ విషయమై తనకు ఆనందంతో పాటు లోటూగానూ ఉందన్నారు. వెంకయ్యకు ఫోన్ చేసి బాబు అభినందించారు. వెంకయ్యనాయుడు నామినేషన్ కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య ఎంపిక తెలుగు ప్రజలు హర్షించదగిన విషయమని కేంద్రమంత్రి సుజానాచౌదరి.

బిజెపి నేతల ఫోన్లు

బిజెపి నేతల ఫోన్లు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడి పేరును ప్రతిపాదించిన తర్వాత ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడారు. అయితే ఈ విషయమై కెసిఆర్ కూడ సానుకూలంగా స్పందించారు. ప్రధాన మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వెంకయ్యనాయుడు పేరును ఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారుచేసినట్టు చెప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌కు ఫోన్ చేసి మద్దతు అడిగారు అమిత్‌షా జగన్ సానుకూలంగా స్పందించారు.

 అన్ని పార్టీల మద్దతు లభిస్తోంది

అన్ని పార్టీల మద్దతు లభిస్తోంది

వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి పదవిపేరును ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తికి ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరమన్నారు. పార్టీలకు అతీతంగా వెంకయ్యనాయుడికి మద్దతుతెలిపే అవకాశం ఉంటుందన్నారు.వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు కెటిఆర్ పేర్కొన్నారు.

ప్రముఖుల అభినందనలు

ప్రముఖుల అభినందనలు


ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడిని ఎంపికచేయడం పట్ల కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు.వెంకయ్యనాయుడును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ అభినందించారు. రాజ్యసభలో సమర్థుడైన వ్యక్తి అవసరమని భావించి వెంకయ్యనాయుడిని ఎంపిక జరిగిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు.అన్నిపక్షాలు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తాయన్నారు.

English summary
Senior political leaders across the country, from the BJP and its allies, congratulated Venkaiah naidu for his nomination. PM Modi, Union Ministers Rajnath Singh, Ravi Shankar Prasad, Smriti Irani and Dr Harsh Vardhan, state chief minister Chandrababu Naidu, Shivraj Singh Chauhan and Dr Raman Singh, among others, congratulated Naidu on his nomination and wished him the best.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X