విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్యకుమారి మృతిలో అదే మిస్టరీ: మలుపు తిరుగుతున్న కేసు

తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిన చివరి మూడు గంటల్లో ఏం జరిగిందో తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని డాక్టర్ సూర్య కుమారి తండ్రి విజయ్ కుమార్ అన్నారు. చట్టంపై నమ్మకం ఉందని, దర్యాఫ్తులో అన్ని విషయాలు తె

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిన చివరి మూడు గంటల్లో ఏం జరిగిందో తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని డాక్టర్ సూర్య కుమారి తండ్రి విజయ్ కుమార్ అన్నారు. చట్టంపై నమ్మకం ఉందని, దర్యాఫ్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

అర్ధరాత్రి వారి మధ్య ఏం జరిగింది? పెళ్లైన వాడికి ఇచ్చేవాడిని కాదు: సూర్యకుమారి పేరెంట్స్అర్ధరాత్రి వారి మధ్య ఏం జరిగింది? పెళ్లైన వాడికి ఇచ్చేవాడిని కాదు: సూర్యకుమారి పేరెంట్స్

తన కుటుంబానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని కోరారు. సూర్య కుమారి సోదరి, ఐఏఎస్ అధికారి హెప్సిబా ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద పోలీస్ అధికారులతో మాట్లాడారు. మరోవైపు, ఆమె అంత్యక్రియలు గడ్డమణుగులో ఆదివారం జరిగాయి.

హత్యా, ఆత్మహత్యనా?

హత్యా, ఆత్మహత్యనా?

డాక్టర్ సూర్యకుమారి కేసులో ఆదివారం కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమెది హత్యా? ఆత్మ హత్యా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఆమె ప్రియుడు విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. శనివారం రాత్రి రైవస్‌ కాల్వ నిడమానూరు వద్ద డాక్టర్‌ సూర్యకుమారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా స్వస్థలం జి కొండూరు మండలం గడ్డమణుగుకు తీసుకెళ్లారు.

Recommended Video

Girl kidnapped at Mylardevar palli | Oneindia Telugu
నివేదికకు రెండు నెలల సమయం

నివేదికకు రెండు నెలల సమయం

కనీసం చివరి చూపుకైనా నోచుకోలేని దీనస్థితి కూతురు మృతదేహం ఉండడంతో తల్లి, బంధువులు రోదించారు. మూడు రోజుల పాటు నీళ్లల్లో ఉండడంతో శరీరం ఉబ్బి వాసన రావడంతో మార్చురీ బయట గదిలో ఉంచారు. సూర్యకుమారి సోదరి హెబ్సిబా రాణి, తండ్రి విజయ్‌కుమార్‌, ఇతర కుటుంబ సభ్యులు చూసి చలించిపోయారు. శరీరంపై హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలించారు. శరీర భాగాలను సేకరించి పరీక్షలకు పంపారు. నివేదికలు రావడానికి రెండు నెలలు సమయం పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఆ దిశగా దర్యాఫ్తు చేయండి

ఆ దిశగా దర్యాఫ్తు చేయండి

సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన కుమార్తె మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి విద్యాసాగర్‌(బాబీ) సెల్ ఫోన్ ఇవ్వడానికి తమ ఇంటికి వచ్చేంత వరకు ఏం జరిగిందో పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు.

గంట వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు ప్రేరేపించారు?

గంట వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు ప్రేరేపించారు?

గంట వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన విషయాలు, వ్యక్తులను విచారించి తగు న్యాయం చేయాలని తండ్రి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు విచారణను సరిగా చేయడం లేదనిపిస్తోందన్నారు. విద్యాసాగర్‌ చెప్పేది ప్రతీది అబద్ధమేనని, పోలీసులు అతని వలలో పడి విచారణను మధ్యలోనే ఆపేశారన్నారు.

ఏం జరిగిందో దర్యాఫ్తులో తేలుతుంది

ఏం జరిగిందో దర్యాఫ్తులో తేలుతుంది

పోస్టుమార్టంలో డాక్టర్ మృతదేహం నుంచి కొన్ని కీలక అవయవాలు, ఆధారాలు సేకరించి ప్రయోగశాలలకు పంపామని, ఈలోగా అభియోగాలున్న విద్యాసాగర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చామని, అతనిపై 306, 420 కేసులను నమోదు చేయగా, మొదటి ఏసీఎంఎం కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. హత్యా? ఆత్మహత్యా? అనేదానిని ఇప్పట్లో చెప్పలేమన్నారు.

English summary
Vidyasagar was on Sunday arrested in the suspicious death of doctor K Surya Kumari (25), whose body was found in a canal in Krishna district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X