India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీటర్ చంద్రం గురించి విజయ్ మాల్యా చెప్పిందిదే; గంజాయిపాత్రుడు, బుచ్చిగా అంటూ రెచ్చిపోయిన సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, అయ్యన్నపాత్రుడుని, వంగలపూడి అనితను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.

ప్రతీ ఊరిలో రెండు అన్నా క్యాంటీన్లు పెట్టి పాప ప్రాయశ్చిత్తం చేసుకో చంద్రం

ప్రతీ ఊరిలో రెండు అన్నా క్యాంటీన్లు పెట్టి పాప ప్రాయశ్చిత్తం చేసుకో చంద్రం

చంద్రబాబు ప్రతి ఊరిలో 2 అన్న క్యాంటీన్లు పెట్టి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. అలాగే అస్సాం వరద బాధితులకు వెయ్యి లారీల నిత్యావసర సరుకులు పంపించమంటూ సూచించారు. ఎక్కడ వరదలొచ్చినా లైవ్ కవరేజి పెట్టించుకుని జెండాలూపేవాడివి అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఆ ట్రక్కులు పార్టీ ఆఫీసుకే తిరిగొచ్చేవి. ఫ్రీ పబ్లిసిటీ దొరికేది అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

దొంగబిల్లులు రాసి పంచుకున్న దాంట్లో గంజాయి పాత్రుడే కింగ్ పిన్

దొంగబిల్లులు రాసి పంచుకున్న దాంట్లో గంజాయి పాత్రుడే కింగ్ పిన్

గతంలో టీడీపీ హయాంలో హుద్ హుద్ తుఫాన్ తర్వాత ఒడిషాకు పదివేల కరెంటు స్థంభాలు, వెయ్యి ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు పంపిస్తున్నట్టు బాబు జాతీయ నాయకుడి రేంజిలో చెప్పుకున్నాడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. అవి తమకు అందనే లేదని తర్వాత ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. దొంగ బిల్లులు రాసి పంచుకున్న దాంట్లో 'గంజాయి' పాత్రుడే కింగ్ పిన్ అంటూ చంద్రబాబును, అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.

మద్యం బ్రాండ్ల గురించి వేశ్యల చేత చిలక పలుకులు పలికిస్తున్నాడు

మద్యం బ్రాండ్ల గురించి వేశ్యల చేత చిలక పలుకులు పలికిస్తున్నాడు

మరోవైపు బ్రోతల్ హౌస్ వగలాడి ఓనర్ మాటలు నిజం అని నమ్మేలా ఉంటాయి అంటూ వంగలపూడి అనిత ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఆమెపై మరోమారు పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వంగలపూడి అనితపై పదేపదే బ్రోతల్ హౌస్ ఓనర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. చీటర్ చంద్రం మద్యం బ్రాండ్ల గురించి వేశ్యల చేత చిలక పలుకులు పలికిస్తున్నాడు అంటూ విరుచుకు పడుతున్నారు విజయసాయిరెడ్డి. వెన్నుపోటు వీరుడు ఎవరికెంత ఇచ్చింది, తనను ఎలా బ్లాక్ మెయిల్ చేసాడో విజయ్ మాల్యా దేశం వదిలిపారిపోయే ముందు చెప్పాడు అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మద్యం బ్రాండ్లలో విషం; నారా నీచుడు దొంగ రిపోర్ట్.. తాము టెస్టులు చెయ్యలేదన్న ల్యాబ్

మద్యం బ్రాండ్లలో విషం; నారా నీచుడు దొంగ రిపోర్ట్.. తాము టెస్టులు చెయ్యలేదన్న ల్యాబ్

మద్యం బ్రాండ్లలో విషం ఉందని దొంగ రిపోర్టు సృష్టించాడు నారా నీచుడు అంటూ విజయసాయిరెడ్డి లోకేష్ ను టార్గెట్ చేశారు. తాము టెస్టులే చేయలేదని SGS ల్యాబ్ చెప్పుతో కొట్టిందని పేర్కొన్నారు. పాయిజన్ అయింది తెలుగు దొంగల పార్టీ బుర్రలు, ఈర్ష్య ఆలోచనలు అని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. బెల్టు షాపులు నడిపించిన రోజుల్లో కల్తీ సరుకు అమ్మించాడు అల్జీమర్స్ అంటూ మండిపడ్డారు. ఇప్పుడా స్కోపే లేదు మెంటల్ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? బుచ్చయ్య చౌదరి టార్గెట్

హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? బుచ్చయ్య చౌదరి టార్గెట్

గోరంట్ల బుచ్చయ్య చౌదరి టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి మళ్లీ ఒరేయ్ అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఒరేయ్ బుచ్చిగా! గతంలో మహిళ అని చూడకుండా అభాగ్యురాలిని ఈడ్చి కొట్టావు. వయసుకు తగ్గ హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? అంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడితే పేదలను తరిమికొట్టింది నువ్వు మర్చినట్టు నటించినా, అందరికీ గుర్తుంది? అంటూ నాటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు.

English summary
YSRCP MP Vijayasaireddy made shocking remarks that Vijay Mallya had said about the cheater chandrababu. Saireddy, was targeted ayyanna patrudu and gorantla butchaiah choudary, and Vangalapudi Anitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X