వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జేసీ నోట చంద్రబాబు మాట! కరోనా ఏమోగానీ నారా వైరస్‌ను తరిమికొట్టారు’

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ్య సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ కంటే నారా వైరస్ భయంకరమైనదని, అయితే రాష్ట్ర ప్రజలు ఈ వైరస్ కు మందు కనుగొన్నారని వ్యాఖ్యానించారు. వరుస ట్వీట్లలో ఈ టీడీపీ నేతలపై ఘాటుగా స్పందించారు.

లోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి: విజయసాయి చురకలులోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి: విజయసాయి చురకలు

బీసీలకు ద్రోహం చేసిన బాబు..

బీసీలకు ద్రోహం చేసిన బాబు..

‘రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా, ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదు. ఫలితంగా రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి బిసీలకు ద్రోహం చేయడమే కాక నిధుల రాకను కూడా అడ్డుకుంటున్నాడు' అని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

జేసీతో చెప్పించింది చంద్రబాబే..

జేసీతో చెప్పించింది చంద్రబాబే..

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడు. ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విజయసాయి ఈ మేరకు స్పందించారు.

కరోనా ఏమోగానీ.. నారా వైరస్‌ను తరిమికొట్టారు..

కరోనా ఏమోగానీ.. నారా వైరస్‌ను తరిమికొట్టారు..

‘‘నారా వైరస్' కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది' అంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

కరోనాపై పార్లమెంటులో..

‘కరోనా వైరస్‌పై బుధవారం రాజ్యసభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన అనంతరం మాట్లాడుతూ ఈ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన వాక్సిన్‌ కోసం ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయో వివరించాల్సిందిగా మంత్రిని కోరడం జరిగింది' అని తన ప్రసంగానికి సంబంధించిన లింక్ ను విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

English summary
vijay sai reddy lashes out at chandrababu and lokesh for bc reservation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X