వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నేతలు పార్టీలు మారినా తప్పించుకోలేదు: విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో టీడీపీని నేతలను నీడలా వెంటాడుతామని సంకేతాలిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. అందుకోసమే అవినీతి రహిత పాలన కోసం జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు, ఆయన కోటరి వెన్నులో వణుకు మొదలైందని ఆరోపించారు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ప్రభుత్వం తీసుకునే చర్యలతో .. టీడీపీ నేతలు గజగజ భయపడిపోతున్నారని పేర్కొన్నారు.

రైతులను పట్టించుకోలేదు.
కౌలు రైతులను చంద్రబాబు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై ఆదివారం ట్వీట్టర్‌లో విమర్శించారు. కానీ జగన్ కౌలు రైతుల కోసం రైతు భరోసాతు అన్ని పథకాలు వర్తించేలా 15.30 లక్షల మందికి మేలు చేకూర్చే నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అంతేకాదు అవినీతిపై సీఎం జగన్ జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏలపై సమీక్షించడంతో .. చంద్రబాబు, ఆయన కోటరి వణికిపోతుందని తెలిపారు. అంతేకాదు తమ హయాంలో రూపాయి అవినీతి జరగలేదని బీరాలు పోయే నాయకులు .. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దీంతో కొందరు పార్టీ మారాలని కూడా నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. అయితే వారు పార్టీ మారినా, పార్టీలో ఉన్న .. అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

vijay sai warns tdp leaders

దీనినిబట్టి గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని విడిచిపెట్టరని అర్థమవుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తమ పారదర్శకతను చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది జగన్ సర్కార్. దీంతో ఏ చిన్న అవినీతికి పాల్పడిన తాట తీస్తామని తమ చేతలతో ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. అయితే దీనికి విపక్ష టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
In the AP, the leader of the party signaled to chase the leaders of the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X