• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ సర్కారుపై వైసీపీ సాయిరెడ్డి అనూహ్యం.. జగనే గొప్పంటూ.. అసభ్య కూతలు, అబద్ధాలన్న బుద్ధా..

|

పాజిటివ్ కేసులకు దీటుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై రాజకీయాలు నడిచాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రస్తుతం సైలెంట్ అయిపోవడంతో మహమ్మారిపై విమర్శలు, ప్రతివిమర్శలు దాదాపుగా తగ్గిపోయాయి అనుకుంటున్నవేళ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన కామెంట్లతో మళ్లీ కలకలం రేపారు. కరోనాకు సంబంధించి దేశమంతా ఒక్కటిగా పోరాడుతున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ఇస్తుండగా.. ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

  టిడిపి MP Ram Mohan Naidu కి వైసిపి MP Vijaya Sai Reddy Counter

  లోకేశ్ 'పెళ్లాం' కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..

  సీఎం జగన్ తో పోలిక..

  సీఎం జగన్ తో పోలిక..

  కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య దాదాపు 14వేలకు చేరువైంది. సోమవారం కొత్తగా 706 కేసులు,ఆదివారం 813, శనివారం 796 కేసులు వచ్చాయి. కరోనా పేషెంట్లను గుర్తించడానికి చేపట్టే టెస్టుల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ నంబర్లు మెరుగ్గా ఉన్నట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. సంక్లిష్ట సమయం కావడంతో ఎవరు ముందు, ఎవరు వెనుక అనే పోటీ తత్వాన్ని అందరూ నివారించారు. కాగా, ఎంపీ సాయిరెడ్డి మాత్రం, ఏపీ సీఎం జగన్ తో ఇతర ముఖ్యమంత్రుల్ని పోల్చారు.

  కేజ్రీవాల్ పై కామెంట్లు..

  కేజ్రీవాల్ పై కామెంట్లు..

  వైరస్ వల్ల తీవ్రంగా ఎఫెక్టయిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో 1.64 లక్షల కేసులతో మహారాష్ట్ర ముందుండగా, 83వేల పైచిలుకు కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నది. దాదాపు మూడు కోట్ల జనాభాకుతోడు, చుట్టుపక్కల రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్ నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి ట్రీట్మెంట్ పొందుతారు. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు ఆధీనంలోని ఆస్పత్రులకు విపరీతమైన తాకిడి పెరిగింది. దీంతో ఢిల్లీ వాసులకు తప్ప మిగతా రాష్ట్రాల వారికి కొవిడ్-19 చికిత్స అందించబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రకటన ఆధారంగా.. ఏపీ, ఢిల్లీకి పోలిక పెడుతూ కేజ్రీవాల్ ను ఉద్దేశించి విజయసాయి ఇలా అన్నారు..

  జగన్‌కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్‌లో ట్విస్ట్

  ఏపీలో తేడాల్లేవు..

  ఏపీలో తేడాల్లేవు..

  ఢిల్లీ వాసులకు మాత్రమే అక్కడి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ ఇస్తామని కేజ్రీవాల్ సర్కారు చెబుతుండగా.. జగన్ సర్కారు మాత్రం రాష్ట్రంతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ చికిత్స అందిస్తోందని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. రాబోయే 90 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయి స్క్రీనింగ్ శాంపిల్స్ ను సేకరించబోతున్నామని, తద్వారా కరోనా నియంత్రణ, చికిత్సలో జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా నియంత్రణలో కేజ్రీవాల్ సర్కారు విఫలమైందంటూ బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సమయంలోనే వైసీపీ కూడా ఆప్ సర్కారుతో పోలికలు పెట్టుకోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

  కథలు నమ్మే రోజులు కావు..

  కథలు నమ్మే రోజులు కావు..

  కరోనా విషయంలో కేజ్రీవాల్ సర్కారుతో ఏపీని పోల్చిన వైసీపీ ఎంపీ.. స్థానిక ప్రత్యర్థులపైనా విరుచుకుపడ్డారు. జగన్ సర్కారు తీరుపై ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక చైర్మన్ రాసిన వ్యాసంపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాతలలో కొత్త పుంతలు తొక్కిస్తూ హాస్యం పడిస్తున్నారని, ఇవి స్కైలాబ్ కథనాలను నమ్మే రోజులు కావంటూ సెటైర్లు వేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘స్పందన' కార్యక్రమం సీఎం జగన్ మానస పుత్రిక అని, ఏడాది తిరగక ముందే 33 లక్షల సమస్యలు పరిష్కారమయ్యాయని ఎంపీ తెలిపారు.

  అన్నీ అసభ్య కూతలు..

  అన్నీ అసభ్య కూతలు..

  మెయిన్ స్ట్రీమ్ మీడియాలోగానీ, సోషల్ మీడియాలోగానీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇస్తూ, ఎదురు ప్రశ్నిస్తారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కొంతకాలంగా వీళ్లిద్దరి మధ్య సాగుతోన్న డైలాగ్ వార్ ఇటీవల పీక్స్ కు చేరింది. సాయిరెడ్డివన్నీ అసభ్య కూతలేనని, అనవసరమైన అన్ని విషయాలపైనా స్పందిస్తారుగానీ, ప్రజాధనాన్ని వైసీపీ నేతలు మింగేసిన కుంభకోణాల గురించి మాటమాత్రమైనా మాట్లాడబోరంటూ వెంకన్న ఎద్దేవా చేశారు.

  రూ.25వేల కోట్ల స్కామ్..

  రూ.25వేల కోట్ల స్కామ్..

  ‘‘విజయసాయి గారూ.. అస‌భ్య‌పు కూత‌లు, అబ‌ద్ధ‌పు రాత‌ల‌తో ప‌త్తిత్తులాగ రోజుకిన్ని ట్వీట్లేస్తున్నారు. కానీ, రూ. 25 వేల కోట్ల విలువైన మ‌ద్యం స్కామ్‌పై ఎందుకు మాట్లాడటం లేదు? రూ.300 కోట్ల విలువైన 108 కుంభ‌కోణం ఎందుకు ఊసెత్తరెందుకు? విశాఖ‌లో క‌బ్జాకు గురైన భూముల గురించి నోరెత్తరేం? ఈ విషయాల్లో మీరు మౌనంగా ఉంటున్నారంటే అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లే కదా'' అని బుద్ధా వెకన్న మండిపడ్డారు.

  English summary
  claiming that andhra pradesh govt is far better in dealing with covid-19, ysrcp mp vijaya sai reddy compares with delhi's arvind kejriwal govt. tdp mla budda venkanna questiones mp to respond on land and 108 scam
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X