వైసీపీది ఒంటరి పోరే-భయపడే వారే పొత్తులకు-గుంటూరు జాబ్ మేళాలో సాయిరెడ్డి కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయాల్లో పొత్తుల అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల గడువున్నా ఇప్పటి నుంచే పొత్తులపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాల పర్యటనల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ నేతల్ని కలవరపెడుతున్నాయి. దీంతో తమ పొత్తులపై వారు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇవాళ గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో ప్రారంభమైన జాబ్ మేళాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులో జాబ్ మేళా ప్రారంభం
గుంటుూరు నాగార్జున యూనివర్శిటీలో రెండు రోజుల పాటు జరిగే వైసీపీ మెగా జాబ్ మేళా ఇవాళ ప్రారంభమైంది.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని మిగతా నేతలు, అదికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగార్ధులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మెజా జాబ్ మేళాల సిరీస్ లో ఇది మూడోది. ఇప్పటికే తిరుపతి,విశాఖలో రెండు జాబ్ మేళాల్ని నిర్వహించారు.
పొత్తులపై విజయసాయిరెడ్డి కామెంట్స్
ఏపీలో
రెండేళ్ల
తర్వాత
జరిగే
సార్వత్రిక
ఎన్నికల్లో
పొత్తులపై
చర్చ
జరుగుతున్న
నేపథ్యంలో
వైసీపీ
స్టాండ్
పై
ఎంపీ
విజయసాయిరెడ్డి
మరోసారి
క్లారిటీ
ఇచ్చారు.
వైసీపీ
పోరు
ఒంటరిగానే
ఉంటుందన్నారు.
వచ్చే
ఎన్నికల్లో
వైఎస్
ఆర్
కాంగ్రెస్
పార్టీ
ఒంటరిగా
బరిలోకి
దిగుతోందని,
వైసీపీకి
ఎవరితో
పొత్తు
పెట్టుకోవాల్సిన
అవసరం
లేదని
ఆయన
పునరుద్ఘాటించారు.
ఈ
మధ్య
కాంగ్రెస్
పార్టీ
వైసీపీతో
పొత్తు
పెట్టుకుంటుందన్న
చర్చ
జరిగిన
నేపథ్యంలో
సాయిరెడ్డి
మరోసారి
ఈ
క్లారిటీ
ఇచ్చారు.
భయంతోనే పొత్తులని ఎద్దేవా
ఓటమి
భయంతోనే
కొందరు
పొత్తులు
పెట్టుకుంటారని
టీడీపీ,
జనసేన
వంటి
విపక్షాలను
ఉద్దేశించి
విజయసాయిరెడ్డి
వ్యాఖ్యానించారు.
ఎవరు
ఎవరితో
పొత్తులు
పెట్టుకున్నా
వైసీపీ
విజయాన్ని
ఆపలేరన్నారు.
మరో
20,
25
ఏళ్ళు
అధికారంలో
ఉంటామని
ఆయన
ధీమా
వ్యక్తంచేశారు.
చంద్రబాబును
ప్రజలు
ఎప్పుడో
తిరస్కరించారని,
ప్రజల్లో
ఆయన
పట్ల
విశ్వసనీయత
లేదన్నారు.
అధికారం
ఆయన
వదులుకోలేదని,
ఆయననే
ప్రజలు
వద్దనుకున్నారని
విజయసాయిరెడ్డి
గుర్తుచేశారు.