వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది తలల విషనాగుతో పోరాడారు .. పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు : విజయసాయి భావోద్వేగం

|
Google Oneindia TeluguNews

ఏపీలో నేడు వైసీపీ విజయం సాధించిన రోజు కావటంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నారు. అయితే కరోనా కష్టకాలం కావటంతో బయట హడావిడి చెయ్యటం లేదు. కానీ వైసీపీ శ్రేణులు వైసీపీ అధికారం సాధించి ఏడాది కావటంతో సంతోషం వ్యక్తం చేస్తూ తమ పోస్ట్ ల ద్వారా అభిమానాన్ని చాటుకుంటున్నారు .ఇక వైసీపీ విజయం సాధించటం ఏపీకి నవశకం అని,నేడు పచ్చ పార్టీని పాతాళానికి తొక్కిన రోజనీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇసుక నుండి తైలం తీసే మీ తెలివి జగన్ కు ఎక్కడిది : చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలుఇసుక నుండి తైలం తీసే మీ తెలివి జగన్ కు ఎక్కడిది : చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

 నవశకానికి నాంది పలుకుతూ ఇచ్చిన ప్రజా తీర్పు చిరస్మరణీయం

నవశకానికి నాంది పలుకుతూ ఇచ్చిన ప్రజా తీర్పు చిరస్మరణీయం

ఇక నేడు ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురై విజయసాయి వరుస ట్వీట్లు చేశారు . ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన తన సంతోషం వ్యక్తం చేశారు . ఇక అంతే కాదు చంద్రబాబు కుట్రలను తట్టుకుని వైసీపీ ప్రభంజనం సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ ధైర్యం , పట్టుదల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు

జగన్ ధైర్యం , పట్టుదల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు


తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు చేశారని , జైలుకు పంపడం కూడా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్ లు కూడా వేశారు. కానీ జగన్ కు ఉన్న ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు అని వ్యాఖ్యానించారు విజయసాయి రెడ్డి . ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చాలా భావోద్వేగానికి లోనై ట్వీట్ చేశారు.

ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జగన్

ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జగన్

ఇక ఇంకో ట్వీట్ లో ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్' ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసిందని పేర్కొన్నారు . ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు అంటూ గత ఎన్నికల విజయాన్ని గుర్తు చేశారు . తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు'తో పోరాడారాయన అంటూ చంద్రబాబు పాలనను, టీడీపీని విమర్శించారు . చంద్రబాబును పదితలల విషనాగుతో పోల్చారు. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు అంటూ విజయసాయిరెడ్డి టీడీపీని ఉద్దేశించి మరో ట్వీట్‌ చేశారు విజయసాయి రెడ్డి.

English summary
Vijayasai tweeted a series of tweets on Twitter today. "Today is a momentous day in the history of the Andhra Pradesh he said. On the same day a year ago, he said, "The whole country has seen the spectacle of ycp's acheivement Jagan made history with unilateral victory
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X