వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్.. వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక: అందుకేనని విజయసాయి ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

బుట్టా రేణుక ఫ్లోర్ లీడర్‌ జాబితాలో చేరిక పై విజయ్ సాయి రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ: పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రెండేళ్లుగా కోరుతోంది.

చదవండి: మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?

ఇప్పుడు వైసీపీ ఫ్లోర్ లీడర్ జాబితాలో బుట్టా రేణుక పేరు ఉండటాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని, లోకేష్‌కు ఇంగ్లీష్, తెలుగు రాదని ఎద్దేవా చేశారు.

జగన్! 24 గంటలు టైమిస్తున్నా లేదంటే: మురళీ మోహన్ కోడలు హెచ్చరికజగన్! 24 గంటలు టైమిస్తున్నా లేదంటే: మురళీ మోహన్ కోడలు హెచ్చరిక

బుట్టా రేణుకను ఎలా పిలుస్తారు?

బుట్టా రేణుకను ఎలా పిలుస్తారు?

విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రేపటి నుంచి పార్లమెంటు హాలులో వైసీపీ మాజీ ఎంపీలం నిరసన చేపడతామని విజయ సాయి రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.

టీడీపీకి ఆ ఉద్దేశ్యం లేదు

టీడీపీకి ఆ ఉద్దేశ్యం లేదు

తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు సజావుగా సాగాలని లేదని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించాలన్న ఉద్దేశ్యం వారికి ఓ కోశాన లేదన్నారు. ఏపీకి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అడ్రస్ చేయాలని మాత్రమే టీడీపీ విజ్ఞప్తి చేసిందని చెప్పారు.

రాబోయే ఎన్నికల కోసం డ్రామాలు

రాబోయే ఎన్నికల కోసం డ్రామాలు


టీడీపీకి సభను సాగనిచ్చే ఉద్దేశ్యం లేదని విజయసాయి అన్నారు. ప్రజా ప్రయోజనాలు కాపాడే ఉద్దేశ్యంతో లేరన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఏపీపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ఉండేది కాదన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైసీపీ అన్నారు. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

బీజేపీ అందుకే అడ్వాంటేజ్ తీసుకుంటుంది

బీజేపీ అందుకే అడ్వాంటేజ్ తీసుకుంటుంది


ఇప్పుడు టీడీపీపై బీజేపీ ఎందుకు అడ్వంటేజ్ తీసుకుంటుందంటే.. చంద్రబాబు నాడు ప్యాకేజీకి అంగీకరించడం వల్లేనని విజయసాయి రెడ్డి అన్నారు. తెలుగు దొంగల పార్టీ సభలో ఏం చేస్తారనే దానిపై పార్లమెంటు సమావేశాలు సజావుగా నడుస్తాయా లేదా తెలుస్తుందని చెప్పారు. ఏపీ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలనే చిత్తశుద్ధి వారికి లేదన్నారు.

English summary
YSR Congress Party Rajya Samba member Vijaya Sai Reddy fired for 'Butta Renuka as YSRCP floor leader'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X