• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇలా ఎంతకాలం నెట్టుకొస్తావ్ పార్టీని చంద్రం ; టీడీపీ పరువు తీసేస్తూ సాయిరెడ్డి మైండ్ గేమ్

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి, చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు బయటపడిన టిడిపి రాజకీయంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి ఇప్పటి వరకు రాజకీయంగా పుంజుకోలేకపోతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమల్లోకి తీసుకొస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజాక్షేత్రంలో టిడిపికి మనుగడ లేకుండా చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా, రాష్ట్రంలో వరుసగా ఏ ఎన్నికలు జరిగినా టీడీపీ ఘోర పరాజయం పాలవుతోంది. దీంతో టిడిపి పనైపోయిందని వైసిపి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారానికి తెర తీశారు.

చంద్రబాబును నమ్మిన వాళ్లెవరూ బాగుపడ్డ చరిత్ర లేదు... తస్మాత్ జాగ్రత్త.. విజయసాయి రెడ్డి హితవు</a><a href=" title="చంద్రబాబును నమ్మిన వాళ్లెవరూ బాగుపడ్డ చరిత్ర లేదు... తస్మాత్ జాగ్రత్త.. విజయసాయి రెడ్డి హితవు" />చంద్రబాబును నమ్మిన వాళ్లెవరూ బాగుపడ్డ చరిత్ర లేదు... తస్మాత్ జాగ్రత్త.. విజయసాయి రెడ్డి హితవు

టీడీపీకి ఏలూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల దెబ్బ .. మైండ్ గేమ్ ఆడుతున్న సాయిరెడ్డి

టీడీపీకి ఏలూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల దెబ్బ .. మైండ్ గేమ్ ఆడుతున్న సాయిరెడ్డి

ముఖ్యంగా విజయసాయిరెడ్డి టిడిపి పరువును నిలువునా తీస్తున్నారు. చంద్రబాబు పనైపోయిందని, తెలుగుదేశం పార్టీ మూత పడుతుందని పదేపదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న విజయ సాయి రెడ్డి ఇటీవల ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోమారు వరుసగా చంద్రబాబును,టిడిపి నేతలను ఏకిపారేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నేతలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. విజయ సాయి రెడ్డిని ఎదుర్కోవడం, తట్టుకోవడం టిడిపి శ్రేణులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఇంతకు ముందు సాయిరెడ్డి వ్యాఖ్యలకు మాటకు మాట కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు.

అచ్చెన్న వ్యాఖ్యలే ఆయుధంగా పదేపదే టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ

అచ్చెన్న వ్యాఖ్యలే ఆయుధంగా పదేపదే టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ

తాజాగా మరోమారు విజయసాయిరెడ్డి గతంలో అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇడ్లీ లో చట్నీ వేసుకొని తింటూ అలా చెప్పడం ఏంటని పప్పు బాబుకు అప్పుడు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదు అని చేసిన వ్యాఖ్యలపై పొడుచుకొచ్చింది. సీట్లకే కాదు 14 శాతం ఓట్లకు బొక్క పడింది. ఈసారి పప్పు తింటూ పప్పూ లేదు పార్టీ లేదని చెప్పలేమో అంటూ సెటైర్లు వేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి ఓటింగ్ శాతం కూడా పడిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. అచ్చెన్న వ్యాఖ్యలపై లోకేష్ కు కోపం వచ్చిందని , పప్పు పెద్ద అసమర్ధుడు అనే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేశారు.

ఇలా ఎంతకాలం నెట్టుకొస్తావు పార్టీని చంద్రం అంటూ ఎద్దేవా

ఇలా ఎంతకాలం నెట్టుకొస్తావు పార్టీని చంద్రం అంటూ ఎద్దేవా

అంతేకాదు పదవి పోయిన రెండేళ్లలోనే ఏ స్థాయికి దిగజారావు చంద్రం అంటూ చంద్రబాబు రెండేళ్లలో బాగా దిగజారిపోయాడని విజయసాయి పేర్కొన్నారు. ధర్నాలకు కిరాయి మనుషులు, ఎల్లోమీడియా మైకుల ముందు ఆర్తనాదాలు చేయడానికి పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి ఇలా ఎంతకాలం నెట్టుకొస్తావు పార్టీని అంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పార్టీలో ఎవరూ లేరని, ప్రస్తుతం పార్టీకోసం పనిచేస్తున్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ లేనని, ధర్నాలు చేస్తున్న వారంతా కిరాయి మనిషి లేనని టిడిపి పనైపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

టీడీపీ పనైపోయిందని చెప్పటంలో సక్సెస్ అవుతున్న సాయిరెడ్డి

టీడీపీ పనైపోయిందని చెప్పటంలో సక్సెస్ అవుతున్న సాయిరెడ్డి

ప్రజా విశ్వాసం కోల్పోయిన వారికి రాజకీయ పునర్జన్మ అంటూ ఉండదు. ఇది చారిత్రక సత్యం అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే జనాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, పార్టీ కోసం పని చేసే నాయకులు ఎవరూ లేరని, ప్రజల్లో టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని విజయసాయి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి తగ్గట్టు వరుసగా టిడిపికి ఏపీలో జరిగిన ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగలడం వైసీపీ నాయకులకు అడ్వాంటేజ్ గా మారింది . ఇక దీన్ని పక్కాగా వాడుకోవడంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సక్సెస్ అవుతున్నారు.

English summary
Chandrababu and TDP leaders are been targeted by ysrcp MP Vijayasai reddy again in the wake of the recent Eluru Municipal Corporation election results. ysrcp MP posts on social media, Playing a mind game with TDP leaders.TDP leaders, who had earlier given a verbal counter to Saireddy's remarks, are now silent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X