• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ మెంటల్ కండిషన్‌పై మళ్లీ రచ్చ.. చంద్రబాబైనా చెప్పలేదన్న సైరా.. తొంగిచూడొద్దంటూ అనిత ఫైర్..

|

కొద్ది రోజుల కిందట నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడులో మాట్లాడుతూ.. ఫ్రెంచ్ విప్లవం నేపథ్యాన్ని ప్రస్తావించి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని అనడం.. దానికి కౌంటర్ గా.. బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని, వెంటనే డాక్టర్లకు చూపించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వివాదానికి కొత్త వ్యాఖ్యానాలు జోడిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ రచ్చకుదిగారు.

సరస్వతికి సీఎం జగన్ ప్రాధాన్యం.. డబుల్'ఆర్’తో విధ్వంసం.. లేవకుండా 'లా’తో కొడతానంటూ..

షష్టిపూర్తిపై విసుర్లు..

షష్టిపూర్తిపై విసుర్లు..

హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలృష్ణ షష్టిపూర్తి సందర్భంగా బుధవారం ఆయన ఇంట్లో నందమూరి, నారా కుటుంబీకులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. దీనికి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లకేశ్, కోడలు బ్రహ్మణి, బాలయ్య రెండో కూతురు తేజస్విని, రెండో అల్లుడు భరత్‌, బాలయ్య కొడుకు మోక్షజ్ఞతోపాటు చెప్పుకోదగ్గ సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలోనూ బాలయ్య కేక్ కోసి సంబురాలు చేసుకున్నారు. సోషల్ డిస్టెన్స్ అంశాన్ని లేవనెత్తుతూ బాలయ్య షష్టిపూర్తిపై ఎంపీ విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. బాబు-లోకేశ్‌కు సీబీఐ ఉచ్చు.. మహిళలకు శుభవార్త.. 16 నుంచి అసెంబ్లీ..

మెంటల్ సర్టిఫికెట్ ఉందని..

మెంటల్ సర్టిఫికెట్ ఉందని..

కరోనా వైరస్ తాండవిస్తున్న వేళ దేశమంతా భౌతిక దూరం సూత్రాన్ని పాటిస్తుంటే.. బాలకృష్ణ మాత్రం షష్టిపూర్తి సంబురాలు జరుపుకోవడమేంటని వైసీపీ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడెప్పుడో బాలయ్య ఇంట్లో కాల్పుల సందర్భంలో వైద్యులు ఆయన మానసిక స్థితిని సర్టిఫై చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘చంద్రబాబు గారూ.. మీరైనా చెప్పొచ్చు కదా బావమరిదికి.. మెంటల్ సర్టిఫికెట్ ఉంది కదాని కరోనా సమయంలో కూడా సెలబ్రేషన్లు జరుపుకునే సాహసం చేస్తారా ఎవరైనా? అది కూడా హిందుపురం ప్రజలను గాలికొదిలేసి..''అని వ్యాఖ్యానించారు.

ఆ జబ్బులు తగ్గే మార్గమిదే..

ఆ జబ్బులు తగ్గే మార్గమిదే..

తన పేరు కలిసొచ్చేలా ‘సైరా పంచ్' అంటూ విమర్శలు సంధిస్తోన్న విజయసాయి రెడ్డి.. బాలకృష్ణతోపాటు చంద్రబాబు మెంటల్ కండిషన్ పైనా కామెంట్లు చేశారు. కుళ్లుమోతుతనంతో వచ్చే కడుపుమంట, దుర్మార్గమైన ఆలోచనలు, తీవ్రమైన నిరాశ లాంటి మానసిక వ్యాధులతో చంద్రబాబు బాధపడుతున్నారని, వైద్య శాస్త్రంలో ఆ జబ్బులకు మందులు లేవని, సీఎం జగన్ సారధ్యంలో ఏపీ దూసుకుపోతున్నదనే నిజాన్ని అంగీకరిస్తే తప్ప సదరు జబ్బులు తగ్గబోవని ఎంపీ ఎద్దేవా చేశారు.

ఆయనో సస్కారహీనుడు..

ఆయనో సస్కారహీనుడు..

టీడీపీపై వరుస విమర్శలు చేస్తోన్న విజయసాయి రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత దిమ్మతిరిగే రేంజ్ లో కౌంటరిచ్చారు. పెద్దల సభ ఎంపీ అయిఉండి.. విజయసాయి సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ, దిగజారుడు కామెంట్లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘ఇలాంటి వ్యక్తిని పెద్దల సభకు పంపడంతోనే వైసీపీ పార్టీ వివేకం బయటపడింది. అయినా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది మా అంతర్గత వ్యవహారం. దీనిపై విజయసాయికి ఎందుకంత ఆసక్తి? ఎంతసేపూ టీడీపీ ఆఫీసులోకి తొంగి చూడటం ఆయన మానుకోవాలి''అని అనిత హితవు పలికారు.

  Ram Mohan Naidu Strong Counter To Vijay Sai Reddy | మాట కి మాట..!!
  రామ్మోహన్‌పై చర్చే జరగలేదు..

  రామ్మోహన్‌పై చర్చే జరగలేదు..

  తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు నియామకం దాదాపుగా ఖరారైపోయిందంటూ మీడియాలో వస్తోన్న వార్తలను ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత ఖండించారు. టీడీపీ రాష్ట్ర నాయకుడి ఎంపికకు సంబంధించి మహానాడులో చర్చ జరగలేదని, పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే అంశంపై మాత్రమే మాట్లాడుకున్నామని ఆమె తెలిపారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబుదే తుది నిర్ణయమని, బాబు ఎవరిని నియమించినా ఎప్పటిలాగే క్రమశిక్షణతో పనిచేస్తామని అనిత పేర్కొన్నారు.

  English summary
  raising the social distance concerns, ysrcp mp vijaya sai reddy questioned tdp mla balakrishna 60 birthday celebration. tdp former mla Vangalapudi anitha slams vijaya sai for criticising chandrababu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more