వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఇంట్లోని నేలమాళిగల్లో, మేం అధికారంలోకి వస్తే అంతా తీస్తాం: విజయసాయి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ) నోటీసులు పంపించిందన్న వార్తలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి బుధవారం స్పందించారు. తనకు ఇప్పటి వరకు టిటిడి నోటీసులు అందలేదని చెప్పారు. టీటీడీ దేవస్థానం నగల మాయంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అదీ మరిచాడు, పవన్‌కు ఓటెందుకు వేయాలి, ఓటుకు నోటులో కేసీఆర్ కాళ్లు పట్టుకున్న బాబు: పోసానిఅదీ మరిచాడు, పవన్‌కు ఓటెందుకు వేయాలి, ఓటుకు నోటులో కేసీఆర్ కాళ్లు పట్టుకున్న బాబు: పోసాని

తాను మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నానని చెప్పారు. ఇంతకుముందు తాను 13 గంటల సమయం ఇస్తే స్పందించలేదని చెప్పారు. ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్థానం నిధులు దోచుకున్నారని మండిపడ్డారు. అసలు టీటీడీకి నోటీసులు ఇచ్చే హక్కు లేదని ఆయన తేల్చి చెప్పారు.

బాబు ఇంట్లోని నేలమాళిగల్లో సోదాలు చేస్తే సొమ్ము దొరికేది

బాబు ఇంట్లోని నేలమాళిగల్లో సోదాలు చేస్తే సొమ్ము దొరికేది

అసలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లోని నేలమాళిగలు సోదాలు చేసి ఉంటే శ్రీవారి నుంచి దోచుకున్న సొమ్ము దొరికేదని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. సీబీఐ విచారణలో మాత్రమే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. 14 అంశాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా చెప్పాలని సవాల్ చేశారు.

మేం వచ్చాక మీ అవినీతి బయటకు తీస్తాం

మేం వచ్చాక మీ అవినీతి బయటకు తీస్తాం

తాము (వైయస్సార్ కాంగ్రెస్) అధికారంలోకి వస్తే మీ అవినీతి మొత్తం బయటకు తీస్తామని చంద్రబాబును విజయ సాయి రెడ్డి హెచ్చరించారు. టీటీడీ తనకు నోటీసులు పంపించిందనే వార్తలను చానళ్లలో చూశానని అన్నారు. తనకు మాత్రం నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు అందితే మాత్రం చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.

చంద్రబాబుకు మరోసారి సవాల్

చంద్రబాబుకు మరోసారి సవాల్

నేను చంద్రబాబుకు మరోసారి సవాల్ విసురుతున్నానని విజయసాయి అన్నారు. టీటీడీలో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాఫ్తులో చంద్రబాబు నిర్దోషి అని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీటీడీ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

13 గంటల టైమిస్తే 240 గంటల తర్వాత స్పందన

13 గంటల టైమిస్తే 240 గంటల తర్వాత స్పందన

చంద్రబాబు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేస్తున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీటీడీ సొత్తుపై తాను 13 గంటల గడువు ఇస్తే 240 గంటల తర్వాత స్పందించారన్నారు. నిప్పు నాయుడు, పప్పు నాయుడుల తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.

English summary
YSR Congress Party Rajya Sabha Member Vijaya Sai Reddy responded on Tirumala Tirupati Devasthanam notices over allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X