వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నాడేంటని అందరి డౌట్...ఆ పని చేసిన పుత్రరత్నం కోసమేనని బాంబు పేల్చిన సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, రాష్ట్ర రాజకీయాలలో అతి కీలకమైన విషయాలపై మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి ? ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై పోరాటం సాగించాల్సిన సమయంలో చంద్రబాబు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ? ప్రతి చిన్న విషయానికి వైసీపీ సర్కార్ పై విరుచుకుపడే చంద్రబాబు ఇటీవల కాలంలో మౌనం ఎందుకు దాల్చారు అంటే అందుకు షాకింగ్ సమాధానం చెబుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

చంద్రబాబు సైలెన్స్ వెనుక మతలబు చెప్పిన సాయిరెడ్డి

చంద్రబాబు సైలెన్స్ వెనుక మతలబు చెప్పిన సాయిరెడ్డి

రోజుకో రకమైన వ్యవహారాన్ని తెరమీదకు తెస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అనునిత్యం ఆసక్తికర పోస్టులు చేస్తూ చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో చంద్రబాబు సైలెంట్ గా ఉంటున్నాడని, గతంలో మాదిరి ప్రతిదానికి రాద్ధాంతం చేయడం లేదని చాలామంది అనుకుంటున్నారు అంటూ పేర్కొన్న విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

పుత్రరత్నం లోకేష్ వాట్సప్ చాటింగ్ .. చంద్రబాబు మౌనానికి కారణం

పుత్రరత్నం లోకేష్ వాట్సప్ చాటింగ్ .. చంద్రబాబు మౌనానికి కారణం

పుత్రరత్నం జడ్జీలను కించపరిచేలా చేసిన వాట్సాప్ కామెంట్స్ నుండి దృష్టి మళ్ళించే కుట్రలో తలమునకలై ఉండొచ్చు చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఏం చేసినా ఫోరెన్సిక్ రికార్డును మార్చలేడు కదా అంటూ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, చంద్రబాబుకు మధ్య వాట్సాప్ చాటింగ్ సంభాషణలను సిఐడి బయటపెట్టింది . ఇక నాలుగు రోజుల క్రితం ఎంపీ కి నారా లోకేష్ కు మధ్య జడ్జీల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జరిగిన వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.

ఎంపీ రఘురామతో లోకేష్ వాట్సప్ చాటింగ్ .. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు

ఎంపీ రఘురామతో లోకేష్ వాట్సప్ చాటింగ్ .. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు

ఓ కేసు సందర్భంగా జరిగిన విచారణను ఆన్లైన్ లో డైరెక్టుగా లైవ్ చూసి వారిద్దరూ జడ్జీల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వాట్సప్ చాటింగ్ ద్వారా బయటకు రావడంతో వైసీపీ నేతలు ఎంపీ రఘురామకృష్ణంరాజు, చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుకు, వైసీపీ రెబల్ ఎంపీకి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ , నారా లోకేష్ కు, ఎంపీ రఘురామకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, అలాగే చంద్రబాబు కు ఓ టీవీ ఛానల్ అధినేత కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కూడా వెలుగులోకి రావడంతో ఎంపీని వెనకుండి నడిపిస్తుంది చంద్రబాబే అన్న వైసీపీ నేతల ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అయింది.

సిఐడీ బయటపెట్టిన వాట్సప్ చాటింగ్ పై నోరుమెదపని చంద్రబాబు , లోకేష్ సైలెన్స్

సిఐడీ బయటపెట్టిన వాట్సప్ చాటింగ్ పై నోరుమెదపని చంద్రబాబు , లోకేష్ సైలెన్స్

అయితే ఈ వాట్సాప్ చాటింగ్ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు టిడిపి నేతలు ఎవరూ నోరు మెదపలేదు. ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేంద్రం గెజిట్ ఇచ్చినా చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేశాక స్పందిస్తా అని దాటవేత ధోరణి అవలంబించారు . ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ గట్టిగా గళం వినిపించటం లేదు. ప్రత్యేక హోదాపై వైసీపీ సభా వేదికగా పట్టు పడుతున్నా చంద్రబాబు మౌనంగా చూస్తున్నారు.

కొడుకు ఇరుక్కుంటాడన్న భయంతో చేస్తున్న కుట్రలతో చంద్రబాబు బిజీ అని చెప్పిన సాయిరెడ్డి

కొడుకు ఇరుక్కుంటాడన్న భయంతో చేస్తున్న కుట్రలతో చంద్రబాబు బిజీ అని చెప్పిన సాయిరెడ్డి

ఇక అందరికీ అర్ధం కాని చంద్రబాబు మౌనానికి కారణం చెప్పారు విజయసాయిరెడ్డి . చంద్రబాబు సైలెంట్ గా ఉండడానికి కారణం పుత్ర రత్నం జడ్జీలను కించపరిచేలా చేసిన వాట్సప్ కామెంట్స్, ఈ వ్యవహారంలో ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయంతోనే చంద్రబాబు ఇటీవల సైలెంట్ గా ఉంటున్నారు అని, లేకపోతే ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసి, వైసీపీ పై విరుచుకు పడే వారని ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్తున్నారు.తాజా పరిణామాలను బట్టి సాయిరెడ్డి చెప్పిన దానిలోనూ వాస్తవం ఉండొచ్చు అని పలువురు చర్చిస్తున్నారు.

English summary
TDP chief Chandrababu Naidu to remain silent on the most crucial issues during the parliamentary sessions. YCP MP Vijayasai Reddy gave a shocking answer . chandrababu kept silence for his son Lokesh who had been caught in WhatsApp chat on judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X