• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవతా వస్త్రాలు ధరించి బాబు రాజ్యమంతా తిరిగినట్టు, లోకేశాన్ని యువరాజును చేసినట్టు : సాయిరెడ్డి వ్యంగ్యం

|

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించని రోజంటూ లేదు. నిత్యం చంద్రబాబును టార్గెట్ చేసే విజయసాయి రెడ్డి రోజుకో రకంగా కొత్త కొత్త విషయాలను చెప్పి మరీ చంద్రబాబు మీద ధ్వజమెత్తుతున్నారు. తాజాగా చంద్రబాబు జీవితమంతా మీడియా మేనేజిమెంటు, మ్యానిప్యులేషన్ లతోనే సాగుతోందని విమర్శించారు. జనం ఛీ కొట్టినా జై కొట్టారని రాస్తుంది ఎల్లోమీడియా అంటూ చంద్రబాబుకు సహకరిస్తున్న ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు.

 బీసీలు, ఎస్సీ,ఎస్టీలు అందరికీ అన్యాయం; జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు ధ్వజం బీసీలు, ఎస్సీ,ఎస్టీలు అందరికీ అన్యాయం; జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు ధ్వజం

కలల బేహారి బాబుకు భలే మీడియా దొరికిందని ఎద్దేవా

కలల బేహారి బాబుకు భలే మీడియా దొరికిందని ఎద్దేవా

చంద్రబాబు ను కలవడానికి బిల్ గేట్స్ తెగ వెయిట్ చేస్తారని, ఇలాంటి అభూత కల్పనలు ఎన్ని వినలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో బాబు గెలుపు ఏకపక్షమే అని తీర్పు చెప్పే వరకు పోయింది పైత్యం అంటూ విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఇక కలల బేహారి బాబుకు భలే మీడియా దొరికిందని ఎద్దేవా చేశారు. గుర్రం లేకుండా స్వారీ చేసినట్టు, ఖడ్గం కదిలించకుండానే శత్రువులు రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకున్నట్టు, దేవతా వస్త్రాలు ధరించి బాబు రాజ్యమంతా తిరిగినట్టు, లోకేశాన్ని యువరాజును చేసినట్టు, ఎడతెగని స్వైర కల్పనలో ముంచుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ఆకు రౌడీలా నోరు పారేసుకోవటం ఏమిటి మాలోకం

ఆకు రౌడీలా నోరు పారేసుకోవటం ఏమిటి మాలోకం

చంద్రబాబు పుత్రరత్నం భాషను చూసి సొంత పార్టీ వల్లే నివ్వెరపోతున్నారని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. తీవ్ర నిస్పృహ ఉంటే మాత్రం ఆకు రౌడీలా నోరు పారేసుకోవటం ఏమిటి మాలోకం అంటూ నారా లోకేష్ వుద్దేశించిన నిట్టూర్చారు. అయినా వీధిలో రచ్చ ఎందుకో మాలోకానికే తెలియాలి అంటూ విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి చిట్టీ అంటూ రాజకీయంగా చంద్రబాబు, నారా లోకేష్ లు ఆత్మహత్య చేసుకోవాల్సినదే అంటూ ధ్వజ మెత్తారు.

బాబు డెకాయిటీ పాలనలో ఒక్కో టీచర్ కు ఐదుగురు విద్యార్థులు కూడా లేరు

బాబు డెకాయిటీ పాలనలో ఒక్కో టీచర్ కు ఐదుగురు విద్యార్థులు కూడా లేరు

ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ప్రభుత్వ స్కూల్లో కొత్త కళను సంతరించుకున్నాయని పేర్కొన్న విజయ సాయి రెడ్డి ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు లేవు అని బోర్డులు ఏ రాష్ట్రంలో కనిపించవని, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విప్లవాత్మక మార్పులకు సంకేతం ప్రభుత్వ పాఠశాలలు కిటకిటలాడటమని వ్యాఖ్యానించారు. బాబు డెకాయిటీ పాలనలో ఒక్కో టీచర్ కు ఐదుగురు విద్యార్థులు కూడా లేని స్కూళ్ళు ఎన్నో కనిపించేవని విజయ సాయి రెడ్డి విమర్శించారు. కానీ ఇప్పుడు జగన్ గారి భరోసాతో ప్రభుత్వ స్కూల్స్ స్వరూపమే మారిపోయింది అని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

మీ స్వార్థ బతుకులను చూసి ఈ పిల్లలే తుపుక్కున ఉమ్ముతారు

మీ స్వార్థ బతుకులను చూసి ఈ పిల్లలే తుపుక్కున ఉమ్ముతారు


ఇదే సమయంలో కొత్తరూపు సంతరించుకున్న స్కూళ్లు తాటాకు పందిళ్ళు కావు రెండురోజుల్లో ఎగిరి పోవడానికి అంటూ పేర్కొన్న విజయసాయి జ్ఞాన శిఖరాల్లా ఇంకో యాభై ఏళ్లు ఉంటాయని పేర్కొన్నారు. మా లోకం చేసే యాగీ మూడో రోజు ముగుస్తుంది అన్న ఆయన విద్యను కార్పొరేట్లకు అప్పగించిన మీ స్వార్థ బతుకులను చూసి ఈ పిల్లలే తుపుక్కున ఉమ్ముతారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టిడిపిలో కాక రేపుతున్న నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడును, చంద్రబాబును టార్గెట్ చేస్తూ సైరా పంచ్ వేశారు.

బాబు తిన్నగాలేక ఇవన్నీ వినాల్సిన కర్మ అంటూ టీడీపీ పార్టీ పెద్దలు

బాబు తిన్నగాలేక ఇవన్నీ వినాల్సిన కర్మ అంటూ టీడీపీ పార్టీ పెద్దలు

తెలుగుదేశం పార్టీ వల్లే కమ్మ జాతి నష్టపోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే అందుకు నేను ఒప్పుకోను మొత్తం తెలుగుజాతి నష్టపోయిందని అచ్చెన్నాయుడు అన్నట్టు, దానికి చంద్రబాబు శభాష్ అంటున్నట్టు సైరా పంచ్ వేశారు విజయసాయిరెడ్డి . తెలుగుదేశం పార్టీ దిక్కులేకుండా పోయిందని పేర్కొన్న ఆయన అయ్యో 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇలా దిక్కులేకుండా అయిందేమిటి ? ఎవరో రావాలి అని ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటి ? పార్టీ లేదు బొక్క లేదని అధ్యక్షుడే నిర్వేదంలోకి వెళ్లడం ఏమిటి ? బాబు తిన్నగాలేక ఇవన్నీ వినాల్సిన కర్మ పట్టిందని పార్టీ పెద్దలే తలలు పట్టుకుంటున్నారు అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, లోకేష్ ను , టిడిపిని తూర్పారబట్టారు.

English summary
There is not a day that YSRCP MP Vijayasai Reddy does not criticize TDP chief Chandrababu. Vijayasai Reddy, who is always targeting Chandrababu, is saying new things on a daily basis and raising the flag against Chandrababu. Recently, Chandrababu was criticized for going through media management and manipulation all his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X