వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 ఏళ్లు: వెన్నుపోటుతో అధికారం, ప్రజా బలం లేకుండా, విజయసాయిరెడ్డి ఫైర్, జగన్ హీరో..

|
Google Oneindia TeluguNews

సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో.. ఎన్టీఆర్ నుంచి పార్టీ, అధికారం మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎం పదవీ చేపట్టి 25 ఏళ్లు అవుతోన్న సందర్భంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో అధికార వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

Recommended Video

Chandrababu Naidu has written a letter to Modi Over YSRCP tapping phones
 ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

సీనియర్ ఎన్డీఆర్ పార్టీ ఏర్పాటు చేసి.. అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన రెండో పెళ్లిపై కుటుంబ సభ్యులు అంగీకరించని పరిస్థితి. పార్టీలో లక్ష్మీ పార్వతి పట్టు పెంచుకునే క్రమంలో.. అప్పటి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు తిరుగుబాటు ఎగరవేశారు. అసలు టీడీపీ తమదేనని చెప్పడంతో.. ఎన్టీఆర్ సీఎం పదవీ కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్టీఆర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆగస్టు‌లో మొదలైన సంక్షోభం... చివరి నాటికి కొలిక్కి వచ్చింది. 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వరసగా 9 ఏళ్లు ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.

 అధికారం లాక్కొని..

అధికారం లాక్కొని..

ఆనాడు చంద్రబాబు చేసిన పనిని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. వెన్నుపోటుతో అధికారం లాక్కొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నేతలను కూడబలుక్కొని తిరుగుబాటు చేశారని ధ్వజమెత్తారు. అధికారం చేపట్టేందుకు ప్రజలు తీర్పు ఇవ్వలేదన్నారు. అధికారం చేపట్టి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. వ్యవస్థలను బ్రష్టుపట్టించారని విమర్శించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ.. డర్టీ పొలిటీషియన్‌గా కీర్తి గడించారని మండిపడ్డారు. ప్రజల చీత్కారానికి గురై.. ఇతర రాష్ట్రంలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. సిల్వర్ జూబ్లీ విషెస్ అంటూ సెటైరిక్‌గా ఆయన ట్వీట్ చేశారు.

సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు

సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు

చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు గడిచిన సందర్భంలో టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎన్టీఆర్‌పై కుట్ర చేసి.. పదవీ నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారని గుర్తుచేశారు. ఆనాడు టీడీపీ నేతలు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ, గుర్తు కూడా బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డుకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజా బలంతో అధికారంలోకి వస్తే చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చాడని ధ్వజమెత్తారు.

 వ్యవసాయం దండగ అని

వ్యవసాయం దండగ అని

25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీలేదని మండిపడ్డారు. మీడియా మేనేజ్‌మెంట్‌తో చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అని చరిత్రలో నిలిసిపోయారని విమర్శించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం, ఎత్తివేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన లేఖతో అంకురార్పణ జరిగిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోద కాక ప్యాకేజీకి అంగీకరించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిసి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించని ఘనుడు చంద్రబబాబు అని గుర్తుచేశారు. వెన్నుపోటుతో పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జీరో.. 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరో అని పేర్కొన్నారు.

>

English summary
ysrcp mp vijaya sai reddy slams tdp chief chandra babu naidu on silver jubilee celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X