• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చరిత్ర హీనుడిగా చంద్రబాబు.. మాలోకానికి ఇమేజ్ లేదు; ఆర్తనాదాలు చేస్తే ఎలా రాజా : సాయిరెడ్డి ధ్వజం

|

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను సోషల్ మీడియా వేదికగా నిత్యం టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో వారు చంద్రబాబు, లోకేష్ ల తో పాటు అశోక్ గజపతిరాజు పై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి. తాజాగా ప్రభుత్వంపై బురద చల్లటం పనిగా పెట్టుకొని నారా లోకేష్ ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు అంటూ విమర్శించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

గుదిబండను వదిలించుకోలేక పచ్చపార్టీ నేతలే అలా అంటున్నారు

గుదిబండను వదిలించుకోలేక పచ్చపార్టీ నేతలే అలా అంటున్నారు

రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లయినా మాలోకానికి సొంత ఇమేజ్ లేదంటూ ద్వజమెత్తారు. ప్రభుత్వంపై బురద లక్ష్యంగా పెట్టుకొని ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నాడు అని మండిపడ్డారు. వ్యక్తిగత వ్యవహారాల్లో దూరి కుటుంబాలను బజారుకీడుస్తూ సంబరపడుతున్నాడు లోకేష్ అంటూ విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ గుదిబండను వదిలించుకోలేక పచ్చపార్టీ నేతలే పార్టీ లేదు బొక్క లేదు అంటున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్ తెలుగుదేశం పార్టీకి గుదిబండలాగా మారాడని తనదైన శైలిలో సెటైర్ వేశారు.

మాన్సాస్ భూమాయ బయటపడుతోంది

మాన్సాస్ భూమాయ బయటపడుతోంది

అంతేకాదు మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూ మాయ బయటపడుతోందని విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుకు తొలగిపోయిందని విజయ సాయి రెడ్డి అశోక్ గజపతిరాజును మరోమారు టార్గెట్ చేశారు. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశం ఏంటో అర్థమైపోతుందని పేర్కొన్నారు. వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా అంటూ విజయసాయి రెడ్డి అశోక్ గజపతిరాజు మాన్సాస్ భూ కుంభకోణంలో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు చరిత్ర హీనుడిగా మరోసారి మిగిలిపోయారు

చంద్రబాబు చరిత్ర హీనుడిగా మరోసారి మిగిలిపోయారు


ఇక మరో ట్వీట్లో అగ్రిగోల్డ్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేట్ కంపెనీ మోసం చేసే ఎగ్గొట్టిన డబ్బును బాధితులకు తిరిగి చెల్లించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, బాధితులకు బాసటగా జగన్ సర్కార్ నిలిచిందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇక ఇదే సమయంలో చంద్రబాబు చరిత్ర హీనుడిగా మరోసారి మిగిలిపోయారు అంటూ అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబాబు ని టార్గెట్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసి, డిపాజిట్ దారులను నట్టేట ముంచి, డిపాజిట్ కోల్పోయిన టీడీపీ అంటూ అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబాబు వల్ల డిపాజిట్ దారులు ఇబ్బంది పడ్డారని, అలాంటివారి డబ్బులు చెల్లించి జగన్ బాధితులకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు.

అగ్రి గోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్

అగ్రి గోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్


పాదయాత్రలో, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ అగ్రిగోల్డ్‌ బాధితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదుకుంటున్నారని, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 10.4 లక్షల బాధిత కుటుంబాలకు 905.57 కోట్లు చెల్లించారని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.ఇదే సమయంలో కరోనా కష్టకాలంలో ను సంక్షేమ సేద్యం చేస్తూ అంతులేని ప్రజాదరణతో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు అని పేర్కొన్న సాయి రెడ్డి, ఓట్ల శాతం పడిపోయింది అంటూ గాలివార్తలు రాస్తుంది ఎల్లోమీడియా అంటూ ధ్వజమెత్తారు.

పచ్చ కడుపు మంటకు మరో పాతికేళ్ల పాటు మందు దొరకదు

పచ్చ కడుపు మంటకు మరో పాతికేళ్ల పాటు మందు దొరకదు

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మర్చిపోయింది అని పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చ కడుపు మంటకు మరో పాతికేళ్ల పాటు మందు దొరకదు అంటూ మండిపడ్డారు. ఇక నిన్నటికి నిన్న వెన్నుపోటు వార్షికోత్సవం అంటూ 1995 ఆగస్టు 23 ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు 26 ఏళ్లు. 23 వ తేదీన 23 సీట్లతో మిగిలింది టిడిపి . వెన్నుపోటు దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు.

English summary
Along with Chandrababu and Lokesh, Vijayasaireddy also lashed out at Ashok Gajapathiraju. Rajya Sabha member Vijayasaireddy has criticized Nara Lokesh for launching a fake campaign on the government. sai reddy said that Mansas trust scam is coming out, Ashok Gajapatiraju was targeted. Vijayasaireddy fires on Chandrababu over agri gold affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X