వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ..షర్మిళకు కోర్టు సమన్లు..! కొండా సురేఖ..మురళీ సైతం : అదే రోజు జగన్ అక్కడకు ..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ గౌరవాధ్యక్షురాలు..ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ..సోదరి షర్మిళ కు కోర్టు సమన్లు జారీ అయినట్లు సమాచారం. 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ఇద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, అక్రమాస్తుల కేసులో అదే రోజు కోర్టుకు సీఎం జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇక, 2012 లో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్..టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తెలంగాణలోని పరకాల నుండి కొండా సురేఖ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ప్రచార సమయంలో జరిగిన వ్యవహారం పైన ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో సురేఖ..టీఆర్ యస్ అభ్యర్ధి బిక్ష్మయ్య మధ్య హోరా హోరీ పోటీ సాగింది.

అమరావతి రైతులపై మారిన వైఖరి: ప్రభుత్వ తాజా వ్యూహం: మంత్రి కొడాలికి బాధ్యతలు..!అమరావతి రైతులపై మారిన వైఖరి: ప్రభుత్వ తాజా వ్యూహం: మంత్రి కొడాలికి బాధ్యతలు..!

2012లో ఘటన..కోర్టు సమన్లు

2012లో ఘటన..కోర్టు సమన్లు

విజయమ్మ..షర్మిళకు కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2012లో జగన్ జైళ్లో ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తెలంగాణ జిల్లా వరంగల్ నుండి మంత్రి గా ఉన్న కొండా సురేఖ జగన్ పైన కేసుల నమోదు సమయంలో ఎఫ్ఐఆర్ లో వైయస్సార్ పేరు ప్రస్తావనకు నిరసనగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన జరిగిన అవిశ్వాస ఓటింగ్ లో జగన్ కు మద్దతుగా నిలుస్తూ..వ్యతిరేక ఓటు వేసిన 15 మంది పైన అనర్హత వేటు పడటంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి.

విజయమ్మ..షర్మిళ

విజయమ్మ..షర్మిళ

వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా విజయమ్మ..షర్మిళ ప్రచారం చేసారు. అప్పుడు పరకాల నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ యస్ అభ్యర్ధి భిక్ష్మయ్య మధ్య చివరి దాకా నువ్వే నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఆ ఉప ఎన్నికలో టీఆర్ యస్ అభ్యర్ధి 1562 ఓట్ల తేడాతో సురేఖను ఓడించారు. వైయస్ కుటుంబానికి వీర విధేయురాలిగా ఉన్న సురేఖ ఆ తరువాత దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో మొత్తం 12 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలుపొందారు.

10న సీబీఐ కోర్టుకు జగన్...

10న సీబీఐ కోర్టుకు జగన్...

ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి జగన్ సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. ఇప్పటికే పలు మార్లు కోర్టు విచారణకు హాజరు కాకుండా..గైర్హాజరు పిటీషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. అయితే, గత శుక్రవారం దీని పైన సీబీఐ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ నెల 10న జగన్ తో పాటుగా విజయ సాయిరెడ్డి సైతం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో..ఆ రోజు కోర్టుకు జగన హాజరయ్యే అవకాశం ఉంది. మరి..జగన్ కోర్టుకు హాజరవుతారా..లేక ఆయన తరపు న్యాయవాదులు మరోసారి అనుమతి కోసం ప్రయత్నిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

English summary
Court summoned Ys vijayamma and Sharmila to attend court on 10th of this month in election code violation in 2012 parakala by poll. On the same day Cm Jagan to be attend before CBI court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X