• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప‌వ‌న్.. లోకేష్‌ వ‌ర్సెస్ రోజా..ష‌ర్మిళ‌ : ప‌్ర‌చారంలో టార్గెట్ ఫిక్స్ : 29 నుండి బ‌రిలోకి..!

|

ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారం లో ఇక పంచ్‌లు..సెటైర్లు..వాగ్బాణాలు..వంగాస్త్రాలు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగుతున్న ప్ర‌చారం ఒక ఎత్తు. ఈ నెల 29 నుండి ప్రారంభ‌మ‌య్యే ప్ర‌చారం మ‌రో ఎత్తు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌..ముఖ్య‌మంత్రి త‌న‌యుడు లోకేష్ ల‌క్ష్యంగా ప్రచార బ‌రిలోకి జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌..న‌గ‌రి వైసిపి అభ్య‌ర్ది రోజా రంగంలోకి దిగుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చూ జ‌గ‌న్ పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టటంతో పాటుగా వారిని రాజ‌కీయంగా టార్గెట్ చేయ‌నున్నారు.

ఆ నియోజకవర్గానికి పదుల సంఖ్యలో నామినేషన్లు ? ఎందుకంటే, కారణమిదేనా ?

ఆ ఇద్ద‌రే ల‌క్ష్యంగా...

ఆ ఇద్ద‌రే ల‌క్ష్యంగా...

ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు..టిడిపికి మ‌ధ్య మాత్ర‌మే పోటీ అని భావిస్తున్న వైసిపి నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాన్ మాత్రం చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే న‌డుస్తున్నార‌ని..ఓట్ల చీల‌క కోసం ర‌హ‌స్య మిత్రుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసిపి అధినేత ఆరోప‌ణ‌. దీంతో ఇక ఈ సారి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ ను ల‌క్ష్యంగా చేసుకొని..ఆయ‌న జ‌గ‌న్ పైనా..వైసిపి పైనా చేసే ప్ర‌తీ విమ‌ర్శ ల‌ను తిప్పి కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం వైసిపి నుండి జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ‌..ఎమ్మెల్యే రోజాను రంగంలోకి దించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే న‌గ‌రి నుండి రోజా వైసిపి అభ్య‌ర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేసారు. న‌గ‌రి లో ప్ర‌చారం చేసుకుంటూనూ మంగ‌ళ‌గిరి..భీమ‌వ‌రం..గాజువాక ల్లోనూ రోజా ప్ర‌చారం చేయనున్నారు. ఇక‌, సినిమా రంగా నికి చెందిన కొంద‌రు సైతం వైసిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు. చివ‌రి ప‌ది రోజుల ప్ర‌చారంలో ఇత‌ర ప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పి కొట్టాల‌ని నిర్ణ‌యించారు.

షర్మిళ‌..విజ‌య‌మ్మ బ‌రిలోకి..

షర్మిళ‌..విజ‌య‌మ్మ బ‌రిలోకి..

వైసిపి గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌..జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ సైతం ప్ర‌చారం లోకి దిగుతున్నారు. ఈ నెల 29 నుండి ఆ ఇద్ద‌రూ విడివిడిగా ప్ర‌చారం చేయ‌నున్నారు. ష‌ర్మిళ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం 29న మంగ‌ళ‌గిరి నుండి ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ప్రచారం లో కాలు పెట్ట‌నున్న ష‌ర్మిళ తొలుత ఈ రోజు జ‌రిగిన మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి తో పాటుగా లోకేష్‌..ప‌వ‌న్ క‌ళ్యాన్ మీదా విమ‌ర్శ‌లు చేసారు. ప‌వ‌న్ యాక్ట‌ర్ అని..చంద్ర‌బాబు డైరెక్ట‌ర్ అంటూ ఆయ‌న డైరె క్ష‌న్‌లోనే ప‌వ‌న్ ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇక‌, లోకేష్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టం..ఆయ‌న గ‌తంలో కొన్ని సంద ర్భాల్లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ష‌ర్మిళ గుర్తు చేసారు. ఇక‌, జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం అని చెబుతూ ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం లో త‌న స్టైల్లో ముందుకు సాగ‌నున్నారు.

విజ‌య‌మ్మ రాయ‌ల‌సీమ బాధ్య‌త‌లు

విజ‌య‌మ్మ రాయ‌ల‌సీమ బాధ్య‌త‌లు

జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం ఈ నెల 29 నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు. విజ‌య‌మ్మ గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిళ తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సారి మాత్రం ఇద్ద‌రూ స‌ప‌రేటు బృందాల‌తో విడివిడిగా ప్ర‌చారం చేయా ల‌ని డిసైడ్ అయ్యారు. విజ‌యమ్మ ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమ లోని నియోజ‌క‌వ‌ర్గాల పై దృష్టి సారించ‌నున్నారు. క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వర్గంలో ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్ ఖ‌రారు చేస్తున్నారు. వివేకా హ‌త్య‌తో జ‌మ్మ‌ల‌మడు గు లో అభ్య‌ర్ది సుధీర్ రెడ్డి మిన‌హా మ‌రెవ‌రూ అక్క‌డ ప్ర‌చారం చేయ‌టం లేదు. దీంతో..సొంత బంధు గ‌ణం ఉన్న విజ‌య‌మ్మ ను జ‌మ్మ‌ల‌మ‌డుగు లో ప్ర‌చారం చేయాల‌ని పార్టీ కోరుతోంది. అదే విధంగా అనంత‌పురం, కర్నూలు జిల్లా ల్లోనూ విజ‌య‌మ్మ ప్ర‌చారం ప్ర‌ధానంగా సాగ‌నుంది.

English summary
YCp planning to use Sharmila and Roja for election campaign. Vijayamma also coming for ycp campaign. From 29th of this month Vijayamma Start her campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X