వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచార బ‌రిలోకి విజ‌య‌మ్మ‌..ష‌ర్మిళ : 22న జ‌గ‌న్ నామినేష‌న్ : హెలికాఫ్ట‌ర్ లో 45 నియోజ‌క‌వ‌ర్గాల్లో.

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల ప్ర‌చారానికి వైసిపి అధినేత జ‌గ‌న్ స‌మాయ‌త్తం అవుతున్నారు. జ‌గ‌న్ ఈ నెల 16న ఇడుపుల పాయ లో అభ్య‌ర్దు ల జాబితా విడుద‌ల చేసారు.ఆ వెంట‌నే అక్క‌డ స‌భ‌లో పాల్గొని గుంటూరు జిల్లా గుర‌జాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభి స్తారు. వైసిపి ప్ర‌చారంలో విజ‌య‌మ్మ తో పాటుగా ష‌ర్మిళ పాల్గొంటారు. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ర‌ద్ద‌యింది. హెలికాఫ్ట‌ర్ ద్వారా 45 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసేలా షెడ్యూల్ ఖ‌రారైంది.

<strong>రాప్తాడు టిడిపి లో ట్విస్ట్‌: సునీత స్థానంలో శ్రీరాం...పోటీగా మంత్రులు : సీయం అంగీక‌రించేనా..!</strong>రాప్తాడు టిడిపి లో ట్విస్ట్‌: సునీత స్థానంలో శ్రీరాం...పోటీగా మంత్రులు : సీయం అంగీక‌రించేనా..!

22న జ‌గ‌న్ నామినేష‌న్‌..

22న జ‌గ‌న్ నామినేష‌న్‌..

ఈ నెల 16న ఇడుపుల పాయ‌లో జ‌గ‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైయ‌స్సార్ కు నివాళి అర్పిస్తారు. ఆ త‌రువాత పార్టీ నుండి పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితా ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం అక్క‌డి నుండి నేరుగా గుంటూరు జిల్లా గుర‌జాల‌కు వెళ్లి అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొంటారు. 16వ తేదీ రాత్రి తాడేప‌ల్లి లోని నూత‌న నివాసంలో జ‌గ‌న్ బ‌స చేస్తా రు. గ‌త 14 నెలలుగా 13 జిల్లాలో 134 నియోజకవర్గాల్లో పర్యటించారన్నారు.కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయిన మరోసారి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడానికి ప్రచార ఏ ర్పాట్లు చేస్తున్న‌ట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ నెల 22న జ‌గ‌న్ పులివెందుల లో నామినేష‌న్ దాఖ‌లు చేస్తారు.

ప్ర‌చారం లో విజ‌య‌మ్మ‌..ష‌ర్మిళ‌..

ప్ర‌చారం లో విజ‌య‌మ్మ‌..ష‌ర్మిళ‌..

వైసిపి ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలోకి పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌..జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ దిగుతున్నారు. జ‌గ‌న్ త‌న ప్ర‌చారంలో తాను ఉంటారు. వీరిద్ద‌రూ విడివిడిగా..కొన్ని స‌భ‌ల్లో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. మొత్తం రోజుకు నాలుగు స‌భ‌ల్లో వారిద్ద‌రూ పాల్గొంటారు. 2012 లో ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ జైళ్లో ఉండ‌టంతో వీరిద్ద‌రే పార్టీ అభ్య‌ర్ధుల తర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. 2014 ఎన్నిక‌ల స‌మ యంలోనూ వైసిపి అభ్య‌ర్ధుల‌కు మ‌ద్ద‌తుగా వీరిద్ద‌రూ ప్ర‌చారం చేసారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ విశాఖ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఎన్నిక‌ల్లో మాత్రం కుటుంబ స‌భ్యుల‌ను బ‌రిలోకి దించ‌టం లేదు. అయితే, వీరిద్ద‌రి సేవ‌ల ను మాత్రం ప్ర‌చారం కోసం వినియోగించుకోవాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

హెలికాఫ్ట‌ర్ ద్వారా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు

హెలికాఫ్ట‌ర్ ద్వారా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు

16వ తేదీన ప్ర‌చారం ప్రారంభించ‌నున్న జ‌గ‌న్ ఆ వెంట‌నే 17న న‌ర్సీప‌ట్నం, నెల్లిమ‌ర్ల‌, గ‌న్న‌వ‌రం స‌భ‌ల్లో పాల్గొంటారు . రోజుకు మూడు ప్ర‌చార స‌భ‌ల్లో జ‌గ‌న్ పాల్గొంటారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత ప్ర‌తీ రోజు నాలుగు స‌భల్లో జ‌గ‌న్ పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది. స‌మ‌యం త‌క్కువగా ఉండటం తో హెలికాఫ్ట‌ర్ ద్వారా ప్ర‌చారం వేగ‌వం తం చేయాల‌ని నిర్ణ‌యించారు. హెలికాఫ్ట‌ర్ ద్వారా దూరంగా ఉన్న జిల్లాలోని 45 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ పర్య‌ట‌న సాగ నుంది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. ఈ సారి జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిళ తో పాటుగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు సైతం వైసిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చార ప‌ర్వంలో భాగ‌స్వాములు కానున్నారు.

English summary
YCP election campaign starts on 16th from Idupulapaya. Jagan announce party list and start campaign. Viajyamma and Sharmila participate in election campaign. Jagan file nomination on 22nd this month from Pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X