వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళైన 10 రోజుల్లోనే: భర్త హత్యకు ప్రియుడికి ఎంగేజ్‌మెంట్ రింగ్, కాల్‌డేటా పట్టించింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయనగరం: కట్టుకొన్న భర్తను హత్య చేయించేందుకు ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడ ఇచ్చేసింది భార్య సరస్వతి. విజయవనగరం జిల్లా పార్వతీపురంలో సంచలనం సృష్టించిన శంకర్ రావు హత్య కేసును 24 గంటల్లోపుగానే చేధించారు. ఈ కేసులో అనేక ట్విస్టులున్నాయి ఇష్టం లేని పెళ్ళి చేసుకొన్న సరస్వతి పెళ్ళైన పది రోజులకే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది.

పెళ్ళైన పది రోజులకే శంకర్‌రావును భార్య సరస్వతి సోమవారం నాడు రాత్రి చంపించింది. దొంగతనానికి ప్రయత్నించిన దొంగలు అడ్డుకొన్న శంకర్ రావును హత్య చేశారని భావించేలా ప్లాన్ చేశారు.కానీ, ఈ కేసులో సరస్వతి కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.

శంకర్‌రావును హత్య చేసిన కేసులో భార్య సరస్వతితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ పాల రాజు మంగళవారం నాడు మీడియాకు వివరించారు.

భర్త హత్యకు రింగ్ ఇచ్చిన సరస్వతి

భర్త హత్యకు రింగ్ ఇచ్చిన సరస్వతి

విజయనగరం జిల్లా పార్వతీపురం లో పది రోజుల క్రితం శంకర్‌రావుకు సరస్వతికి వివాహమైంది. శంకర్ రావు సరస్వతికి మేనమామ. శంకర్ రావు పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శంకర్ రావుతో సరస్వతికి వివాహం ఇష్టం లేదు అయితే ఈ విషయాన్ని పెద్దలకు చెప్పకుండా పథకం ప్రకారంగా ప్లాన్ చేసి శంకర్ రావును పెళ్ళైన తర్వాత హత్య చేయాలని ప్లాన్ చేశారు. పెళ్ళికి ముందే శివ అనే యువకుడితో సరస్వతికి మధ్య ప్రేమ ఉంది. అయితే శంకర్ రావును హత్య చేసేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకొనేందుకు సరస్వతి తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ప్రియుడు శివకు ఇచ్చింది దీంతో ప్రియుడు శివ గోపి అనే రౌడీషీటర్‌ను సంప్రదించాడు.రింగ్‌తో పాటు రూ.8 వేలు, రూ.5 వేలు వేర్వేరుగా గోపికి చెల్లించారు.

సరస్వతి, శివ మధ్య ప్రేమ

సరస్వతి, శివ మధ్య ప్రేమ

ఫేస్‌బుక్ ద్వారా సరస్వతి, శివ లు పరిచయమయ్యారు.ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది. అయితే సరస్వతి తల్లిదండ్రులు మాత్రం శంకర్ రావుతో సరస్వతి వివాహన్ని ఫిక్స్ చేశారు. అయితే పెళ్ళైన భర్తను అడ్డు తొలగించుకొన్న తర్వాత వారిద్దరూ కలిసి జీవించాలనుకొన్నారు. దీంతో ఏప్రిల్ 28న, శంకర్‌రావును సరస్వతి వివాహం చేసుకొంది.

పట్టించిన కాల్ డేటా

పట్టించిన కాల్ డేటా

శంకర్ రావు హత్య కేసులో సరస్వతి కాల్‌డేటా పోలీసులకు కీలకంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన కేసును పరిశోధించిన పోలీసులకు సరస్వతి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానాలు వచ్చాయి. సరస్వతి కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. దీంతో శివతో సరస్వతి ప్రేమాయణం విషయం బయటకు పొక్కింది. సరస్వతిని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని బయట పెట్టింది.

దోపిడిగా చూపించే ప్రయత్నం

దోపిడిగా చూపించే ప్రయత్నం

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం సమీపంలో శంకర్‌రావుపై పథకం ప్రకారంగా దుండగులు దాడికి దిగారు. ఈ ప్రాంతంలోనే దాడి చేయాలని ప్లాన్ చేసుకొన్నారు. ప్లాన్ ప్రకారంగానే సరస్వతికి నిందితులు సమాచారం ఇచ్చారు. సరస్వతి కూడ నిందితులకు సహకరించింది. ఆ ప్రాంతానికి చేరుకోగానే కళ్లు తిరుగుతున్నాయని బండి ఆపించింది. దుండగులు వెనక నుండి వచ్చి శంకర్ రావును కొట్టిచంపారు. శంకర్ రావు చనిపోయిన తర్వాత సరస్వతి గాజులను పగులగొట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది.

నిందితులకే బంగారం

నిందితులకే బంగారం

శంకర్ రావు హత్య కేసులో సరస్వతి తన బంగారాన్ని నిందితులకే ఇస్తానని ఇప్పుకొంది. సరస్వతి వద్ద సుమారు 10 తులాల బంగారం ఉంది. బంగారాన్ని దోపిడి చేసేందుకు వచ్చిన బంగారాన్ని దోచుకొన్నారని కుటుంబసభ్యులను పోలీసులను నమ్మించాలని ఆమె భావించింది. భర్త చనిపోతే ఆమె వితంతువుగా మారుతోంది, బంగారాన్ని తీసుకోని వారు డబ్బులుగా మార్చుకోవాలని సరస్వతి ఆమె ప్రియుడు శివలు ప్లాన్ చేశారు. అయితే సరస్వతి ఇచ్చిన సమాచారం మేరకు మానాయిపల్లి వద్ద ఆటోలో వెళ్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Vijayanagarm police arrested six members includinng Saraswathi on Tuesday evening for shankar rao murder case. Viayanagaram sp Palaraju announced that saraswathi main role in Shankarrao's murder case. He spoke to media on tuesday at Vijayanagaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X