• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రతిదానికి కులం కార్డు ఏంటి చంద్రబాబు.. హత్యకు గురైంది బీసీ కాదా ..విజయసాయి ఫైర్

|

ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై టిడిపినేతలు బిసి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. బీసీలపై దాడులు చేస్తున్నారని, బీసీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్టు చేయడంతో హత్య కేసులో కూడా బీసీలను ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.

జగన్ ది మూర్ఖత్వం, నియంతృత్వం ..కొల్లు రవీంద్ర అరెస్ట్ పై నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఫైర్

 టీడీపీ నేతల వ్యాఖ్యలకు చెక్ పెట్టేలా విజయసాయి ట్వీట్

టీడీపీ నేతల వ్యాఖ్యలకు చెక్ పెట్టేలా విజయసాయి ట్వీట్

అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, ప్రస్తుతం కొల్లు రవీంద్ర అందరూ బిసి నాయకులే కావడం,వారిపై రకరకాలుగా కేసులు నమోదు అవడంతో బీసీలపై వివక్ష కొనసాగుతోందని మండిపడుతున్నారు టిడిపి నేతలు. బీసీలను ఐక్యం చేసి ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి నేతల వ్యాఖ్యలకు చెక్ పెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

హత్యకు గురైన భాస్కరరావు బిసి కదా? .. ఎందుకీ కులం కార్డు అంటూ ప్రశ్న

హత్యకు గురైన భాస్కరరావు బిసి కదా? .. ఎందుకీ కులం కార్డు అంటూ ప్రశ్న

మర్డర్ కేసులో టీడీపీ నాయకుడు అరెస్ట్ అయితే బీసీలపై దాడి అంటూ అర్ధరాత్రి ఫోన్ చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు హత్యకు గురైన భాస్కరరావు బిసి కదా? బాధితులకు న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళలు ధర్నాలు మీకు కనిపించడం లేదా? ప్రతి దానికి కులం కార్డు ఏంటి బాబు.. అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు. చనిపోయిన మోకా భాస్కరరావు కూడా బీసీ అని గుర్తు చేశారు. కులం కార్డును వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి సోషల్ మీడియా వేదికగా బీసీలపై కేసులు అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై విమర్శలు గుప్పించారు.

 ప్రతీదీ రాజకేయమేనా బాబు అంటూ ఆగ్రహం

ప్రతీదీ రాజకేయమేనా బాబు అంటూ ఆగ్రహం

ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై కూడా నిప్పులు చెరిగారు .చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులను ఎలుకలకు వదిలేసి కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రమోద్ చేశాడని విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తించదని జీవోలు ఇచ్చింది అందుకే అంటూ పేర్కొన్నారు. అంతేకాదు 1800 అంబులెన్సులు కొన్నానని నిర్లజ్జగా బుకాయిస్తున్నారు అని గుట్టలుగా మూలకు బడిన 108 వాహనాలు ఫోటోలను ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. ప్రతీది రాజకీయం చేయడం చంద్రబాబు అలవాటైపోయింది అని విమర్శలు గుప్పించారు విజయసాయి.

  Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
   బీసీ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని చిత్రీకరించే ప్రయత్నంలో టీడీపీ

  బీసీ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని చిత్రీకరించే ప్రయత్నంలో టీడీపీ

  ఇక టిడిపి నేతలు ఏ మాత్రం తగ్గకుండా బీసీ నేతలు అరెస్ట్ చేశారని, బీసీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని, బీసీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ప్రతి విషయాన్ని బీసీలకు లింకు పెడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీల వ్యతిరేకిగా ఉన్నారని, బీసీలను అడగటమే లక్ష్యంగా పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని చిత్రీకరిస్తున్నారు.

  English summary
  Vijayasaray Reddy tweeted, that Chandrababu Naidu doing politics with Bc card . Isn't Bhaskara Rao the victim of BC? Don't you see thousands of BC women doing dharmas to do justice to the victims? What is the caste card for each of them .. Vijayasai Reddy questioned Chandrababu .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more