• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ నలుగురిపై తీవ్ర వ్యాఖ్యలతో ఏకరువు పెట్టిన విజయసాయి.. టీడీపీ నేతలపై విజృంభించేశారుగా

|

వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టిడిపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురిపై విజృంభిస్తున్నారు . అటు చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసి కోడెల సంగతి చూడండి అంటూ సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి ఇక దేవినేని ఉమా దిగజారాడంటూ, ఊహలకు కూడా హద్దు ఉండాలంటూ దేవినేని పై మండి పడ్డాడు. ఓట్లు వేయకపోతే ఇల్లు కూలుస్తా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చౌకబారు వ్యాఖ్యలతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ దుష్ట చతుష్టయం చేసిన పనే ఇది.. అందుకే ఏపీలో ఇసుక కొరత అన్న దేవినేని ఉమ

 పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ కోడెల సంగతి చూడండి అంటూ విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ కోడెల సంగతి చూడండి అంటూ విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నేత విజయసాయి రెడ్డి ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ కోడెల సంగతి చూడండి అంటూ అటు చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేసి కోడెల వ్యవహారంలో జరుగుతున్న రగడ పై నిర్ణయం తీసుకోవాలంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ఐదేళ్లు ఆంబోతుల జనం పైకి వదిలారని తీవ్రంగా విమర్శించారు . కోడెల గుంపు పొడిచి, తన్నని వారే లేరు. ఇకనైనా దొడ్లో కట్టేయండి లేదంటే తరిమేయండి అంటూ వ్యాఖ్యానించారు. అది కూడా వీలు కాదు అంటే మరో నాలుగు రోజుల్లో గుదె కట్టి గుంజలకు కట్టేయక తప్పదు ప్రభుత్వానికి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. కోడెలపై టీడీపీ ఏం చెయ్యలేకున్నా ప్రభుత్వం కచ్చితంగా చేసి తీరుతుందని ఆయన తన వ్యాఖ్యలతో తేటతెల్లం చేశారు.

చౌకబారు వ్యాఖ్యలు నీకే సాధ్యం చంద్రబాబు అంటూ విజయ సాయి ఫైర్

చౌకబారు వ్యాఖ్యలు నీకే సాధ్యం చంద్రబాబు అంటూ విజయ సాయి ఫైర్

ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఆయన చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు. ఓటు వేయకపోతే ఇల్లు కూలుస్తారా అంటూ చౌకబారు వ్యాఖ్యలు మీకే సాధ్యం చంద్రబాబు గారు అంటూ వ్యాఖ్యానించారు విజయసాయి .మా ఎమ్మెల్యేలను గెలిపించని చోట రూపాయి కూడా ఇవ్వమని సిగ్గు లేకుండా చెప్పిన చరిత్ర మీది అంటూ ఘాటుగా విమర్శించారు. పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామని చెప్పిన జగన్ గారి హుందాతనం మీకు ఎప్పటికీ రాదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని, చౌకబారు వ్యాఖ్యలని ఆయన మండిపడ్డారు.

ఎంత దిగజారావు ఉమా .. అంటూ దేవినేని వ్యాఖ్యలపై ఎదురుదాడి చేసిన విజయసాయి

ఎంత దిగజారావు ఉమా .. అంటూ దేవినేని వ్యాఖ్యలపై ఎదురుదాడి చేసిన విజయసాయి

ఇక అక్కడితో ఆగని విజయసాయి దేవినేని ఉమా పై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా సిమెంటు దుకాణాల నుండి బస్తాకు 5 రూపాయలు వసూలు చేయాలని వైసీపీలో ఉన్న దుష్ట చతుష్ఠయం ప్రయత్నం చేసిందని విమర్శించారు. అందుకే ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తోందని విమర్శలు చేశారు. క ఈ వ్యాఖ్యలకు సమాధానంగా విజయసాయి ఎంత దిగజారావు ఉమా ? ఊహ కల్పనలకు కూడా ఒక హద్దు ఉండాలి. సిమెంట్ కంపెనీలు బస్తాకు ఐదు రూపాయిలు ఇవ్వనందుకే ఇసుకసరఫరా ను ఆపేశామా... నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలెయ్యక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారనేదే కదా నీ బాధ అంటూ దేవినేని ఉమా పై ఎదురు దాడి చేశారు. మొత్తానికి టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై శరపరంపరలా ట్వీట్లతో దాడి చేశారు విజయ సాయి రెడ్డి.

English summary
The YCP leader and Rajya Sabha member Vijayasayara Reddy is severely criticizing TDP leaders. Not one he targeted the four. He made allegations on Chandrababu and Lokesh, kodela shiva prasad and devineni uma. He was outraged by Chandrababu's comments and devineni allegations .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X