• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లీక్డ్ ఆడియోలపై సీరియస్‌గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి

|

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు.

ప్రతిపక్షాల వల్లే మహిళాలోకానికి తీరని అన్యాయం

ప్రతిపక్షాల వల్లే మహిళాలోకానికి తీరని అన్యాయం

మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఇప్పటివరకూ ఏలిన ప్రభుత్వాలు మహిళలను ఓటు బ్యాంకుగా చూశాయని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్‌ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. లోకేష్, టీడీపీ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్‌ అని పేర్కొన్నారు.

లీక్డ్ ఆడియోలపై తీవ్రంగా స్పందించిన వాసిరెడ్డి పద్మ

లీక్డ్ ఆడియోలపై తీవ్రంగా స్పందించిన వాసిరెడ్డి పద్మ

దిశా చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి.. అన్ని పార్టీలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ తెలిపారు. జగన్ ప్రభుత్వం మాత్రమే మహిళల సంక్షేమం, సాధికారిత కోసం పని చేస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పదవుల్లో, నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఇక వైసీపీ నేతలు, మంత్రులపై ఇటీవల విడుదలైన పలు ఆడియోల విషయంపైనా ఆమె స్పందించారు. ఇప్పటికే సదరు నేతలు ఫేక్ వీడియోలని కొట్టిపారేశారని తెలిపారు. విచారణ తర్వాత అసలు విషయం తేలుతుందని, మహిళలకు అన్యాయం జరిగితే జగన్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

చీపుర్లు తిరిగేసి కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయి ఫైర్

చీపుర్లు తిరిగేసి కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయి ఫైర్

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా టీడీపీ నేతలపై తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ' యాప్ పై టీడీపీ నేత నారా లోకేష్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యద‌ర్శి, విజ‌య‌సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందుతున్నావంటూ ఆయన లోకేష్ మీద మండిపడ్డారు. "దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్‍‌తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో" అంటూ విజయసాయి విమర్శించారు.

  Spl Coverage on Muralidhar rao Comments
  టీడీపీ హయాంలోనే అరాచకాలకు పాల్పడ్డారు

  టీడీపీ హయాంలోనే అరాచకాలకు పాల్పడ్డారు

  "దేశంలో మహిళలపై అరాచకాలకు పాల్పడిన ఐదుగురు మంత్రుల్లో బాబు కేబినెట్ లోని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ కూడా ఉన్నారని అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. మహిళలు ఇల్లు దాటి బయటకు రావద్దని, కారు షెడ్లో ఉన్నంత వరకే రక్షణ ఉంటుందని ఉపదేశించింది అప్పటి స్పీకర్ కోడెల కాదా?" అంటూ విజయసాయి మరో ట్వీట్లో విమర్శలు గుప్పించారు. మరో వైపు, విశాఖలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంపై విజయసాయి ఆనందం వ్యక్తం చేశారు. "దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం మన విశాఖలో ప్రారంభించడం గర్వంగా ఉంది. 25 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్ పై 75 ఎకరాల్లో రూ. 110 కోట్లు వెచ్చించి నిర్మించారు" అని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

  English summary
  vijayasai reddy and vasireddy padma slams tdp leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X