వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డి .. లోక్ సభా పక్ష నేతగా మిథున్ రెడ్డికి అవకాశం

|
Google Oneindia TeluguNews

వైసీపీ తరపున పార్లమెంట్‌లో నాయకత్వం వహించే నేతలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వైసీపీ లో జగన్ తర్వాత ముఖ్య నేతగా అందరూ భావించే , పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు జగన్. ఇక లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ, జగన్‌కు సన్నిహితుడైన మిథున్ రెడ్డికి అవకాశం దక్కింది. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు.

జగన్ కు 'అడ్మినిస్ట్రేషన్ గురు' గా అజేయ కల్లం.. ఎందుకంటేజగన్ కు 'అడ్మినిస్ట్రేషన్ గురు' గా అజేయ కల్లం.. ఎందుకంటే

 వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముగ్గురు ముఖ్య నాయకులకు పదవులను కేటాయించి ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వైసీపీ లోక్‌సభాపక్ష నేతగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం మిథున్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి...రాజ్యసభలో ఆ పార్టీకి నేతృత్వం వహించనున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ను ఎంపిక చేసింది. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించింది.

కేంద్రంతో లాబీయింగ్ చెయ్యగల నేత కనుకే విజయసాయికి అవకాశం

కేంద్రంతో లాబీయింగ్ చెయ్యగల నేత కనుకే విజయసాయికి అవకాశం

జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న సమయంలోనే పార్లమెంటరీ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకో లేదు. అయితే అందరూ ఎంపీలు ఆ బాధ్యతను జగన్ పైన పెట్టారు. జగన్ ఎవరిని పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకున్నా అందరికీ ఓకే అని చెప్పారు. అయితే పార్లమెంటరీ పక్ష నేతగా మిథున్ రెడ్డి పేరు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పేరు ప్రధానంగా వినిపించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడాలి అంటే కేంద్రం నుండి నిధులు తీసుకురా గలిగినవారు, కేంద్రంతో లాబీయింగ్ చేయగలిగిన వారు పార్లమెంటరీ పక్ష నేతగా ఉంటే లాభం చేకూరుతుందని జగన్ భావించారు. అందుకే హస్తినలో ఉన్న కేంద్ర ముఖ్య నాయకులతో సంబంధాలున్న విజయ్ సాయి రెడ్డి అయితే ఈ పదవికి సరిగ్గా సరిపోతాడని భావించి విజయసాయిరెడ్డికి పార్లమెంటరీ పక్ష నేతగా అవకాశం కల్పించారు జగన్.

కేంద్రంలో విజయసాయి రెడ్డి , మిథున్ రెడ్డి ఏం చేస్తారో ?

కేంద్రంలో విజయసాయి రెడ్డి , మిథున్ రెడ్డి ఏం చేస్తారో ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పగలనేతలకు, లాబీయింగ్ చేయగల నేతలకు అవకాశం ఇచ్చిన జగన్ అందుకు సమర్ధులుగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లను భావించే అవకాశం ఇచ్చారు. ఇక ఏపీ ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపధ్యంలో మరి ఈ నాయకులు వైసీపీ సర్కార్ కు ఏ మేరకు కేంద్రం నుండి సహకారం అందేలా చేస్తారో వేచ్ చూడాల్సిందే.

English summary
YCP chief AP CM Jagan mohan reddy has declared the leaders who are going to take charge in central politics. Vijayasayreddy was given the chance to be the Leader of Parliamentary Party of the YCP. Rajampet MP Mithun reddy is appointed as lok sabha's leader of YCP and the party lok sabha chief whip was given to the rajamaundry MP Margani Bharat .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X