• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మ సాయి.. టీడిపి ఎంపీలు జంపవ్వడానికి నువ్వా కారణం..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!!

|

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటేవ ఇదే. టీడిపి రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుల వెనక వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి స్క్రీన్ ప్లే నడిపినట్టు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అంతే కాకుండా బీజేపి కి, టీడిపి ఎంపీల మద్య రాయభారం నడిపింది కూడా విజయసాయి రెడ్డే ననే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలకు సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మామూలు ఫోటోలు అయితే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. అయితే బీజేపీలో చేరిన సీఎం రమేష్ సుజనా చౌదరిలు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి భోజనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీడీపీ నుంచిబీజేపీలో చేరికల వ్యవహారాన్ని విజయసాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారన్న చర్చ నెటిజన్లలో జరుగుతోంది.

బీజేపీలోకి టీడీపీ ఎంపీల ఫిరాయింపు..! విజయసాయిపై నెటిజన్ల ఆగ్రహం..!!

బీజేపీలోకి టీడీపీ ఎంపీల ఫిరాయింపు..! విజయసాయిపై నెటిజన్ల ఆగ్రహం..!!

లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరూ రెండు గంటలకు పైగా లోక్‌సభలోనే చర్చించుకున్నారు. మిత్రపక్షం బీజేపీని బలోపేతం చేయడంతోపాటు విపక్షాన్ని దెబ్బతీసే ఎత్తుగడను విజయసాయిరెడ్డి అమలు చేస్తున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదే సందర్భంలో విజయసాయిరెడ్డిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా పేరు పెట్టి పలకరించడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను బీజేపీలోకి చేర్పిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఏపిలో టీడిపి ని ఉనికి లేకుండా చేయడంలో చేతికి మట్టంటకుండా, నెపం మొత్తం బీజేపిపైకి వెళ్లే విధంగా విజయ సాయి రెడ్డి వ్యూహం పన్నారని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

.బీజేపిలో చేరగానే సుజనా పునీతుడు కాలేడు..! ఐటీ, ఈడీ ల నుంచి తప్పించుకోలేడన్న మురళీధర్ రావు..!!

కోట్లాది తెలుగువారి అండ..! పార్టీకి సంక్షోభాలు కొత్త కాదన్న బాబు..!!

కోట్లాది తెలుగువారి అండ..! పార్టీకి సంక్షోభాలు కొత్త కాదన్న బాబు..!!

ఇదిలా ఉండగా నలుగురు నేతలు స్వార్థ రాజకీయాలకోసం టీడీపి జెండా వదిలేసినా.. భుజానికెత్తుకుని మోసే లక్షలాది మంది కార్యకర్తలతోపాటు కోట్లాది మంది తెలుగు ప్రజలు తమ వెనుక ఉన్నారని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. వారు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందని గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలోనూ, ట్విటర్‌లోనూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసి బీజేపి లో చేరిన ఆ నలుగురూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతామని చెప్పడం వారి అవకాశవాదానికి నిదర్శనమని బాబు మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు వారాలు కాకముందే బీజేపి మైండ్‌గేమ్‌ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు బాబు.

స్వార్థా రాజకీయాలకోసం పార్టీ బలి చేయొద్దు..! కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్న బాబు..!!

స్వార్థా రాజకీయాలకోసం పార్టీ బలి చేయొద్దు..! కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్న బాబు..!!

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా టీడిపి పోరాడిందని గుర్తు చేసారు చంద్రబాబు నాయుడు. దాన్ని మనసులో పెట్టుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, 37 ఏళ్ల చరిత్రలో పార్టీ ఎన్నో ఆటుపోట్లను అధిగమించిందని బాబు తెలిపారు. గతంలో ప్రజలు, కార్యకర్తలే ముందుకొచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నడిపి పార్టీని కాపాడారని, ఇప్పుడు టీడిపిని ఇబ్బంది పెట్టాలని చూసినా, చీలికలు తేవాలనే ప్రయత్నించినా ప్రజలు, కార్యకర్తలే కవచాలుగా మారి కాపాడుకుంటారని, టీడిపి పనైపోయిందని ఇది వరకూ చాలా మంది అన్నారని, గతంలోను చాలామంది నాయకులు పార్టీని విడిచి వెళ్లారని, కానీ మేమెప్పుడూ పోరాటం వదలకుండా మళ్లీ అధికారంలోకి వచ్చామని బాబు చెప్పుకొచ్చారు.

  జగన్ రైతు బాంధవుడు అవుతాడు - పుష్ప శ్రీవాణి
  బీజేపి మైండ్ గేమ్ ఆడుతోంది..! పార్టీని ఎవ్వరూ ఏమి చేయలేరన్న మాజీ సీఎం..!!

  బీజేపి మైండ్ గేమ్ ఆడుతోంది..! పార్టీని ఎవ్వరూ ఏమి చేయలేరన్న మాజీ సీఎం..!!

  తాను జీవితమంతా ప్రజల మేలు కోసమే పోరాడానని, అధికారంలో ఉన్నా లేకపోయినా అది కొనసాగుతుందని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేందుకే బీజేపితో విభేదించి, టీడిపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ బీజేపితో మైత్రిని కొనసాగించడం తనకెంతో తేలిక పని అని, కానీ తాను ఎప్పటికీ అలాంటి పని మాత్రం చేయలేదని చెప్పారు. సంక్షోభం ఎదురైనప్పుడు టీడిపి మరింత బలపడిందని, కార్యకర్తలు నిబ్బరంగా ఉంటూ పార్టీపై జరుగుతున్న రాజకీయ, భౌతికదాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  English summary
  YSP MP Vijayasai Reddy is behind the defection of TDP Rajya Sabha members into bjp in the social media. Vijayasai Reddy himself has been campaigning for BJP and TDP MPs. Photos of the TDP MPs joining with vijaya sai reddy are going viral.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more