వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై విజయసాయి ఫైర్.. టీడీపీ హయాంలో లక్షల కోట్ల పెట్టుబడులా ? కాగ్ అప్పులని చెప్పిందే !!

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పార్క్ హయత్ హోటల్ వేదికగా చంద్రబాబు కుట్రలు చేశారని ఇప్పటికే ఆరోపించిన విజయసాయిరెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం జరుపుతానని చంద్రబాబు చెప్తుంటే నిజమేనని నమ్మిన వాళ్లకు ఇది చంద్రబాబు నిజస్వరూపం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.అంతేకాదు తానూ లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు మీ హయాంలో అన్తీ అప్పులేనని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు .ఇక మీడియాతో కూడా పలు అంశాలపై మాట్లాడారు .

బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్టవేసి కుట్రలు .. చేస్తున్న గలీజ్ పనులివే.. తేల్చేసిన విజయసాయి రెడ్డిబాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్టవేసి కుట్రలు .. చేస్తున్న గలీజ్ పనులివే.. తేల్చేసిన విజయసాయి రెడ్డి

వెన్నుపోట్ల తో ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు చంద్రబాబు

వెన్నుపోట్ల తో ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు చంద్రబాబు

ట్విట్టర్ లో చేసిన పోస్టులో విజయసాయి రెడ్డి కమ్మని విందులతో పార్క్ హయత్ హోటల్ వేదికగా ఇలా దొరికిపోతాడు అని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖీ తలపడే యుద్ధానికి సాహసించడు .వెన్నుపోట్ల తో ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీ లేని పోరు జరుపుతారని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

లక్షల కోట్లు పెట్టుబడులా ? అప్పులా ?

లక్షల కోట్లు పెట్టుబడులా ? అప్పులా ?

సైరా పంచ్ కూడా వేశారు విజయసాయిరెడ్డి .చంద్రబాబునాయుడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని చెప్పినట్టు, అయితే కాగ్ రిపోర్టు మాత్రం గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పీకల లోతు అప్పుల్లో కూరుకు పోయిందని పేర్కొన్నట్టు ఆయన ఒకపక్క చంద్రబాబు ఫోటోను,మరోపక్క కాగ్ రిపోర్టును కలిపి పోస్ట్ చేశారు. ఇదే సమయంలో నేరస్తులు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు,అక్కడ ఏదైనా విడిచిపెట్టి, అక్కడ ఉన్నవారినుంచి వారు ఏదైనా తీసుకుని వెళ్తారు. పార్క్ హయత్ హోటల్ వేదికగా కూడా జరిగింది అదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ ముగ్గురు కలిసి చేయాల్సిన రాచకార్యాలు ఏమి ఉన్నాయంటూ అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కూడా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు నిమ్మగడ్డపై డీజీపీకి లేఖ రాసింది అందుకే

అప్పుడు నిమ్మగడ్డపై డీజీపీకి లేఖ రాసింది అందుకే

ఇదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి గతంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని, ఆయన రాజ్యాంగబద్ధ పదవికి అనర్హుడు అనే విషయాన్ని తాము ముందునుంచి చెబుతున్నామని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు డైరెక్షన్లోనే నిమ్మగడ్డ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిజిపి కి లేఖ రాశామని చెప్పిన విజయసాయిరెడ్డి సుజనాతో నిమ్మగడ్డకు ఏం పని ? సుజనా చౌదరి కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య ఏం వ్యాపార లావాదేవీలు ఉంటాయంటూ ప్రశ్నించారు.

 రఘురామకృష్ణంరాజు కు షోకాజ్ నోటీసులు ఇందుకే

రఘురామకృష్ణంరాజు కు షోకాజ్ నోటీసులు ఇందుకే

అంతేకాదు రఘురామకృష్ణంరాజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం పైన కూడా స్పందించారు విజయసాయిరెడ్డి. పార్టీ నియమాలను ఎవరు ఉల్లంఘించినా ఎంత పెద్ద వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడిన వ్యవహారాలపై షోకాజ్ నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ఆయనకు పదవులు లభించాయని, కానీ అది మరిచి పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్లే రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి .

English summary
TDP chief Chandrababu Naidu has been criticized by YCP MP Vijayasai Reddy. Chandrababu says that Millions of investments in tdp regime but CAG says debts during TDP period
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X