• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీ అరాచక పాలనలో మేలు జరిగింది ఎవరికో చెప్పు చంద్రం, ఉద్యోగులను రెచ్చగొట్టేది అందుకేగా !! సాయిరెడ్డి ధ్వజం

|

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, అశోక్ గజపతిరాజును వదలకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నా సరే చంద్రబాబును తన ప్రశ్నలతో, లాజిక్ లతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. టీడీపీ నాయకులను సోషల్ మీడియాలో తూర్పారబడుతూనే ఉన్నారు విజయసాయి రెడ్డి.

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యంచంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

 భూ కుంభకోణాలు కప్పి పుచ్చుకోవటం కోసం ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడు అశోక్

భూ కుంభకోణాలు కప్పి పుచ్చుకోవటం కోసం ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడు అశోక్

తాజాగా మాన్సాస్ ట్రస్టులో ఈవోకు ఉద్యోగులకు మధ్య చోటు చేసుకున్న వివాదం పై ఆసక్తికర పోస్టు పెట్టిన విజయసాయిరెడ్డి మాన్సాస్ లో భూ కుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నాడు అశోక్ అంటూ కామెంట్ చేశారు. మాన్సాస్ 295 ఎకరాల భూములపై స్పష్టత లేదని, 150 ఎకరాల విక్రయాలలో తేడాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ద్రబాబు చుట్టాలను మాన్సాస్ లో ప్రవేశపెట్టి మరీ భూ దందా చేశారని, ఇదేనా నీ పాలన అశోక్? చేసింది నువ్వు అయితే ఈవోకి లేఖలు రాయడం ఏమిటి? అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

చంద్రబాబుపై సొంతం అనుకునేవాళ్ళు కూడా రగిలిపోతున్నారు

చంద్రబాబుపై సొంతం అనుకునేవాళ్ళు కూడా రగిలిపోతున్నారు

అంతేకాదు ఇటీవల గొల్లపూడి చంద్రబాబు వెళ్లిన సమయంలో దళితులు చంద్రబాబును గో బ్యాక్ అంటూ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన సంఘటనపై
సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దళితులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తుంటే నన్ను కాదన్నట్టు భ్రమ పడుతున్నావు కానీ అలా గొంతు ఎత్తడానికి అన్ని వర్గాలు అవకాశం కోసం చూస్తున్నాయి. నీ వెనక ఎవరూ లేరు .. సొంత అనుకునేవాళ్ళు కూడా రగిలిపోతున్నారు. నీ అరాచక పాలనలో మేలు జరిగింది ఎవరికో చెప్పు చంద్రం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును వ్యతిరేకించడానికి రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయని, అందరూ చంద్రబాబు వద్దనే అభిప్రాయంలో ఉన్నారంటూ పేర్కొన్నారు.

 విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చామన్న ఎంపీ

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చామన్న ఎంపీ

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం పై మరో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు మార్మోగుతున్నాయి అని పేర్కొన్నారు. పోలీస్ ఆంక్షలు జోరువాన కొనసాగుతున్నా , కార్మికులు సాగించిన మహా ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొంటామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా జరిపే పోరాటానికి వైయస్సార్ సిపి సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లోనూ పోరాటం చేస్తామని వెల్లడించారు.

  ఈ నెల 24 నుండి బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందన్న ప్రేమేందర్ రెడ్డి..!!
   ప్రజారోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ అంటూ పోస్ట్

  ప్రజారోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ అంటూ పోస్ట్


  అంతేకాదు ప్రజారోగ్యంపై అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ మరో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని వెల్లడించారు. ఇప్పటికే 2900 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ను నియమించిన ప్రభుత్వం ఈ నెలాఖరుకల్లా మరో 3,390 మంది ఎంఎల్ హెచ్ పి లను నియమించనుంది అంటూ ట్వీట్ చేశారు.

  English summary
  Vijaya sai reddy, who had recently made an interesting post on the controversy between Eo and employees at Mansas Trust, was inciting employees to cover up land scams in Mansas. There is no one behind you .. Even those who think their own are on fire. YCP MP Vijayasai Reddy has targeted Chandrababu, saying, "Tell some good has happened during your anarchic rule."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X