• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ మిడతలదండు బీజేపీ వైపు ..డేంజర్ లో బీజేపీ..మోకా హత్యపై విజయసాయి సైరాపంచ్

|

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపిని టార్గెట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు . తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ఇప్పటికే బిజెపిలో చేరి విధ్వంసం చేస్తున్నారని పేర్కొన్న ఆయన,మరి కొందరు టిడిపినేతలు బిజెపి వైపు చూస్తున్నారని బిజెపి ప్రమాదంలో పడబోతుంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మోకా భాస్కర్ రావు హత్యపై సంచలన ట్వీట్లు చేశారు.

ప్రతిదానికి కులం కార్డు ఏంటి చంద్రబాబు.. హత్యకు గురైంది బీసీ కాదా ..విజయసాయి ఫైర్

టిడిపి మిడతలదండు బీజేపీ వైపు ఎగురుకుంటూ

టిడిపి మిడతలదండు బీజేపీ వైపు ఎగురుకుంటూ

ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి ఏడాదికాలంగా తినడానికి ఏమీ దొరకక అల్లాడుతున్న టిడిపి మిడతలదండు కమలం పువ్వు వైపు కదులుతోంది.ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టించిన విషయం గ్రహించే లోగానే మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి. ఇక ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ ఆయన పోస్ట్ చేశారు.

బీజేపీకి విపత్తు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి విపత్తు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటికే టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీలను మిడతలుగా అభివర్ణించి, ప్రస్తుతం టిడిపి నుండి చాలామంది బిజెపి వైపు చూస్తున్నారని వారు కూడా బిజెపి లో చేరితే బిజెపి ప్రమాదంలో పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ కష్టం నుండి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ బిజెపి ప్రమాదంలో ఉందని ఆసక్తికర ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

నేరం చేసినా, సుపారీ ఇచ్చినా తప్పించుకోలేరంటూ మోకా భాస్కర్ రావు హత్యపై పోస్ట్

నేరం చేసినా, సుపారీ ఇచ్చినా తప్పించుకోలేరంటూ మోకా భాస్కర్ రావు హత్యపై పోస్ట్

అంతేకాదు వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి . చంద్రబాబులానే ఆయన క్రిమినల్ మాఫియా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారు. భాస్కర్ రావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్ కు వెళ్లాడట కొల్లు రవీంద్ర. సెల్ ఫోన్ లు ,సీసీ కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్ష్యాలు పనికొచ్చేవేమో. కానీ ఇప్పుడు నేరం చేసినా, సుపారీ ఇచ్చినా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఇక దీంతోపాటు సైరా పంచ్ కూడా వేసాడు విజయసాయి రెడ్డి.

కొల్లు రవీంద్ర, చంద్రబాబుపై సైరా పంచ్

కొల్లు రవీంద్ర, చంద్రబాబుపై సైరా పంచ్

మోకా హంతకులతో ఫోన్లో ఓకే అంత క్లియరా .. అయిపోయిందా.. జాగ్రత్త, పారిపోండి అన్నా .. ప్రాబ్లం లేదు కదా సర్ అంటూ కొల్లు రవీంద్ర చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లుగా ఒక ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఎన్నికలకు ముందు జగన్ అధికారంలోకి రాగానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్ లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తిగా అధికారంలో ఉండరు అంటున్నాడు. ఈ సీబీయెన్ తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జి ఆపేస్తే నోళ్ళు మూగబోతాయి అంటూ మరో పోస్ట్ చేశారు విజయసాయి రెడ్డి.

  Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
  స్వార్థం కోసం జెండాలు మార్చే వారంతా లిటిగేటర్ల అవతారం

  స్వార్థం కోసం జెండాలు మార్చే వారంతా లిటిగేటర్ల అవతారం

  ఇదే సమయంలో మరో ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు విజయసాయిరెడ్డి . స్వార్థం కోసం జెండాలు మార్చే వారంతా లిటిగేటర్ల అవతారమెత్తుతున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థ ఉపేక్షించదు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, పతనమైన విలువలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని పేర్కొన్నారు. ఏదో ఒక వ్యవహారంలో లిటిగేషన్ లు పెట్టాలని చూస్తున్న వారంతా మీడియా ఎంటర్టైనర్ లుగా మిగలడం తప్పా సాధించేది ఏమీ ఉండదు అంటూ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  English summary
  YCP MP Vijayasai Reddy in AP is targeting TDP and making interesting comments. Noting that several MPs of the Telugu Desam Party are already joined the BJP, he added that some BJP leaders are looking at the BJP and the BJP is in danger. He also made sensational tweets on the murder of Moka Bhaskar Rao.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X