India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య రాష్ట్రపతి కాకపోతే ? మీడియా దేశవిభజన డిమాండ్లా- పార్లమెంట్ లో బిల్లుకు సాయిరెడ్డి రెడీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మీడియాకూ, వైసీపీకి మధ్య మొదలైన వార్ నానాటికీ తీవ్రమవుతోంది. ఇందులో ఇప్పటికే ఎంతోమంది పావులుగా మారిపోయారు కూడా. తాజాగా రాష్ట్రపతి పదవికి అభ్యర్దిగా ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వెంకయ్యనాయుడిని ఎంపికచేయకపోవడంపై మీడియా స్పందించిన తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏకంగా మీడియాను దేశద్రోహులతో పోల్చారు. వీరిని కట్టడిచేసేందుకు పార్లమెంటులో బిల్లు పెడతానని హెచ్చరించారు.

వెంకయ్య రాష్ట్రపతి పదవి వివాదం

వెంకయ్య రాష్ట్రపతి పదవి వివాదం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వెంకయ్యనాయుడిని ఎంపిక చేస్తారని ఏపీలో ఓ వర్గం మీడియా తీవ్రంగా ప్రచారం చేసింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ రెచ్చిపోయింది. కానీ చివరికి వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవితోనే సాగనంపాలని మోడీ-షా ద్వయం నిర్ణయించింది. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును ఎంపిక చేసింది. దీంతో అప్పటివరకూ వెంకయ్య రాష్ట్రపతి అవుతారని ఆశించిన వారందరికీ నిరాశ తప్పలేదు.

మీడియా ప్రత్యేక దేశం డిమాండ్లు

మీడియా ప్రత్యేక దేశం డిమాండ్లు

వెంకయ్యకు రాష్ట్రపతి పదవి నిరాకరించడంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, ఇదేమీ తొలిసారి కాదని గతంలోనూ ఇలాంటి అన్యాయాలు చాలానే జరిగాయని, కాబట్టి దక్షిణాది ప్రజలు ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తున్నారంటూ ఏపీలో ఓ వర్గం మీడియా ప్రచారం మొదలుపెట్టింది. వెంకయ్యకు అన్యాయం జరిగిన విషయాన్ని బలంగా ప్రస్తావిస్తూ పలు కథనాలు వండి వారుస్తోంది. వెంకయ్య సొంతపార్టీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రపతి పదవికి ఆయన అభ్యర్ధిత్వంపై మౌనంగా ఉంటుంటే టీడీపీ నేతలు మాత్రం ఈ డిమాండ్ వినిపించడం చర్ననీయాంశమైంది. దీనికి కొనసాగింపు మీడియా ప్రత్యేక దేశం డిమాండ్లు చేయడం విచిత్రంగా మారింది.

ఎల్లో మీడియాను దేశద్రోహులన్నసాయిరెడ్డి

ఎల్లో మీడియాను దేశద్రోహులన్నసాయిరెడ్డి


ఏపీలో వెంకయ్య రాష్ట్రపతి కాకపోతే దక్షిణాదికి అన్యాయం జరిగినట్లుగా ఫోకస్ చేస్తూ ప్రత్యేక దేశం డిమాండ్లు వినిపిస్తున్న పలు ఛానళ్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఆయా ఛానళ్ల పేర్లను ట్వీట్ లో పెట్టి మరీ చీవాట్లు పెట్టారు. ఆయా ఛానళ్లు జర్నలిజం నైతిక సూత్రాల్ని మర్చిపోతున్నారని విమర్శించారు. దక్షిణాదిలో ప్రత్యేక దేశం డిమాండ్లు వినిపిస్తున్నాయంటూ వారు చేస్తున్న ప్రచారం ఫేక్ అని దేశద్రోహం కిందకు వస్తుందని కూడా హెచ్చరించారు. ఈ మీడియాలో ఉన్న జర్నలిస్టులు, ఎడిటర్లు జాతి వ్యతిరేకశక్తులని కూడా సాయిరెడ్డి విమర్శించారు. వీరు దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు.

పార్లమెంటులో బిల్లుకు రెడీ

పార్లమెంటులో బిల్లుకు రెడీ

వెంకయ్య రాష్ట్రపతి కాకపోతే ప్రత్యేక దేశం డిమాండ్లు వినిపిస్తున్న మీడియా ఛానళ్లను నియంత్రించేలా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఓ బిల్లు ప్రవేశపెట్టాలని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి నిర్ణయించారు. సమాజంలోని ఈ దుష్టశక్తులపై తగిన చర్యలు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్ కు అధికారాలు కల్పించేలా ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు మీడియా వర్సెస్ వైసీపీ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. సాయిరెడ్డి కోరినట్లు ప్రెస్ కౌన్సిల్ కు మీడియాను నియంత్రించే అధికారం ఇచ్చేందుకు మిగతా పార్టీలు అంగీకరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది.

English summary
ysrcp mp vijaya sai reddy has slammed telugu media for demanding separate country after venkaiah naidu denied presidential post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X