వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సొమ్మంతా విదేశాలకు! నరికి చంపినా..: చంద్రబాబుపై విజయసాయి నిప్పులు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆరోపించారు.

ప్రతిపక్షం, మహిళలు, దళితులు, మీడియాపై దాడులు పెరిగిపోయాయని, అన్యాయం, అక్రమాలు, ధనార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేసే ఘనుడు చంద్రబాబు అని, ప్రభుత్వంలోని న్యాయ, శాసన, కార్యనిర్వహక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా..

రాజ్యాంగానికి విరుద్ధంగా..


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి 22మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిలో కొందరిని మంత్రులు చేసిన చంద్రబాబు.. రాజ్యాంగ వ్యవస్థను నీరుగార్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అనర్హత వేటు వేయాల్సిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు.

ఒక్క సామాజిక వర్గానికే..

ఒక్క సామాజిక వర్గానికే..


ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ.. మిగితా సామాజిక వర్గాలను, ప్రజలను విస్మరించేలా కార్యనిర్వాహక యంత్రాంగం వ్యవహరిస్తోందని ఆరోపించారు. భూసేకరణ చట్టంలో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుని, ప్రాజెక్టులన్నింటినీ తన మనుషులకు వచ్చేలా చంద్రబాబు చూశారని ఆరోపించారు.

ఆ సొమ్మంత విదేశాలకు..

ఆ సొమ్మంత విదేశాలకు..

ప్రాజెక్టులు, కాంట్రాక్టుల ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్మును మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ నియామకంలోనూ ఆకస్మాత్తుగా మార్పులు చేసి.. తన అడుగులకు మడుగులొత్తేవాళ్లని నియమించుకున్నారని విమర్శించారు.

మీడియాపై నియంత్రణ.. రాష్ట్రానికి అపకీర్తి..

మీడియాపై నియంత్రణ.. రాష్ట్రానికి అపకీర్తి..

ఫైబర్ గ్రిడ్ పేరుతో డిజిటల్ మీడియాతో నియంత్రించే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారని, తనకు గిట్టని ఛానెళ్లను లాకౌట్ చేసే పరిస్థితి కల్పించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అనుమతిలేని బోటులో రాష్ట్రపతి సతీమణిని ప్రయాణించేలా చేసి.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి అపకీర్తి తెచ్చిందని మండిపడ్డారు.

నడిరోడ్డుపై నరికి చంపినా..

నడిరోడ్డుపై నరికి చంపినా..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నడిరోడ్డుపై నరికి చంపినా.. అందుకు బాధ్యులను అరెస్ట్ చేయడం లేదని విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేక శక్తులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

జగన్ యాత్ర.. స్తూపాల ఏర్పాటు

జగన్ యాత్ర.. స్తూపాల ఏర్పాటు

వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 29వ తేదీతో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గంలో స్తూపాన్ని ఏర్పాటుచేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. 3వేల కిలోమీటర్లు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ప్రజాసంకల్పయాత్ర వెయ్యికిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి మండలంలోనూ, నియోజకవర్గస్థాయిలోనూ, జిల్లాస్థాయిలోనూ మార్చ్‌ లేదా పాదయాత్ర వంటి కార్యకలాపాలు చేపట్టాలని, దేశంలోని, విదేశాల్లోని తెలుగు ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

English summary
YSRCP leader Vijayasai Reddy on Wednesday fired at Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X