వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

46ఏళ్ల యువకుడే ఆదర్శం, ఎవరికాళ్లు పట్టుకుంటారో: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఆగడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు

దేశానికి ఆదర్శం..

దేశానికి ఆదర్శం..

‘రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిషన్, అమ్మ ఒడి, గ్రామ వలంటీర్ వ్యవస్థ, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వంటి @AndhraPradeshCM గారి సాహసోపేత పథకాలు, నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. మొదటిసారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. @ysjagan' చంద్రబాబుకు చురకలంటించారు.

అసలు సినిమా ఇప్పుడే..

అసలు సినిమా ఇప్పుడే..

‘పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడు. డ్యాం పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయి.ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని వెతుకుతున్నాడు.అసలు సినిమా ఇప్పుడే మొదలైంది' అంటూ నారా లోకేష్, చంద్రబాబును ట్యాగ్ చేశారు.

నాయకుడిగా.. ఈవెంట్ మేనేజర్‌కి అదే తేడా

నాయకుడిగా.. ఈవెంట్ మేనేజర్‌కి అదే తేడా

‘పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ దబాయించాడు @ncbn. లాంచి ప్రమాదానికి ప్రైవేటు వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదే అని @AndhraPradeshCM గారు హుందాగా అంగీకరించారు. నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే' అనిచ చంద్రబాబును విమర్శించారు.

విజయసాయిపై చంద్రబాబు ఇలా

విజయసాయిపై చంద్రబాబు ఇలా

గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను తమ పార్టీ వారికే ఇచ్చుకుంటున్నామని బహిరంగంగా చెప్పడంపై గత కొద్దిరోజుల క్రితం చంద్రబాబు విజయసాయిపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయి గత చంద్రబాబు పాలనే లక్ష్యంగా వరుస ట్వీట్లతో విమర్శలు ఎక్కుపెట్టారు.

English summary
YSRCP MP Vijayasai Reddy lashed out at TDP president Chandrababu Naidu for his ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X