• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ లెక్కన మీ ప్రతిపక్ష హోదా పోయినట్టేగదయ్యా .. సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి

|

టిడిపి అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన పాపానికి ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా నిత్యం టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబును నిత్యం ఎద్దేవా చేస్తున్నారు. ఇక టీడీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ ఆత్మరక్షణ ధోరణి లో పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.

విజనరీ...సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి : విజయసాయి సెటైర్విజనరీ...సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి : విజయసాయి సెటైర్

చంద్రబాబు టార్గెట్ గా సైరా పంచ్

చంద్రబాబు టార్గెట్ గా సైరా పంచ్

ఇక తాజాగా సైరా పంచ్ వేసిన విజయ్ సాయి రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 17 మాత్రమే అంటూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇక అందులో 17 మంది మీతో ఉన్నారు ఈ లెక్కన మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోయినట్టేగదయ్యా అంటూ మహిళలందరూ ఏడుస్తూ చంద్రబాబు వద్దకు వెళ్ళినట్లుగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు టిడిపి నేతలకు ఇబ్బందికరంగా మారగా, ఏపీలో ఆసక్తికర రాజకీయ చర్చ జరుగుతోంది.

పార్టీని వదిలి వెళ్ళద్దు అని ఎమ్మెల్యేకు తక్షణం 5 కోట్ల నజరానా

పార్టీని వదిలి వెళ్ళద్దు అని ఎమ్మెల్యేకు తక్షణం 5 కోట్ల నజరానా

ఇక అంతేకాదు నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక్క ఎమ్మెల్యేని బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లద్దు అంటూ ప్రాధేయపడ్డాడట. అంతేకాదు తక్షణం ఐదు కోట్ల రూపాయలు అరేంజ్ చేశారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ లోటు లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి. ఇక ఖజానా దోచినోడికి ఇది ఒక లెక్కనా అంటూ ఆయన మండిపడ్డారు.

తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదు

తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదు

ఇక అంతేకాదు మరో ట్వీట్ లో అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు ,నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకు రావడం చంద్రబాబుకే చెల్లింది అంటూ విజయసాయి మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం తనే ఆత్మరక్షణ ధోరణిలో పడడం విస్మయం కలిగిస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదనే సంకేతాలు ప్రజల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాయి అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు .

  AP Assembly Budget Sessions పెద్దల సభలో మంటలు, ఏరా అంటూ మంత్రి మీదికి వెళ్లారని...!!
   మిగిలింది వారే .. ప్రకృతి సంపదను దోచిన ఘనులు

  మిగిలింది వారే .. ప్రకృతి సంపదను దోచిన ఘనులు

  అంతేకాదు పెద్ద బాబు కోటరీలో ప్రస్తుతం ఉన్న వ్యక్తులు అందరిచే తిరస్కరించబడిన వారని, ఇక ఈ వ్యక్తులు చిన్న బాబు లాగే అసమర్థులు, చిన్నబాబు తరహా ఆసక్తులు ఉన్నవారిని ప్రస్తుతం పార్టీలో మిగిలి ఉన్న టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దోచుకునే మార్గాలనే ఎంచుకున్నాడు అని ఆరోపించారు విజయసాయి రెడ్డి . ఇసుక, భూమి, గాలి , నీటిని వేటినీ కూడా విడిచిపెట్టలేదు. ఆయన ప్రకృతి సంపదను కూడా దోచుకున్న ఘనుడు అని పేర్కొన్నారు.చంద్రబాబు నిరుపేదల ఆరోగ్య చికిత్స కోసం ఇవ్వాల్సిన డబ్బును కూడా తీసుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు .

  English summary
  Vijayasai criticised chandrababu naidu. He said that As CM chandrababu always looked for means and ways to loot public money. He did not spare Sand, Land, Wind & Water too. He eyed God’s own wealth. He even took away money meant for the treatment of BPL and LIG families. he lost his opposition status with latest election scenario.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X