• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ సంవత్సరీకాలు జరుపుకోవటం ఏమిటీ ? ప్రజలకు సేవ చెయ్యండయ్యా : టీడీపీ నేతలకు విజయసాయి చురకలు

|

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా వేదికను కూల్చేస్తే మీ సొంత ఇల్లు నేలమట్టమైనట్టు సంవత్సరీకాలు జరుపుకోవడం ఏంటయ్యా.. కాస్త ప్రజలకు ఏమైనా సేవ చెయ్యండయ్యా అంటూ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అంతే కాదు అచ్చెన్నాయుడు వ్యవహారంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్ట్ .. ఏపీలో మరో సోషల్ మీడియా కేసు ..వృద్ధుడు అరెస్ట్

ఆహా నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు' అని చంద్రబాబు గర్విస్తాడా

ఆహా నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు' అని చంద్రబాబు గర్విస్తాడా

అచ్చెన్నాయుడు ఒక సంతకం తోనే అరెస్టయితే నేను మంత్రిగా రోజుకు అలాంటి సంతకాలు 100 పెట్టాను అన్న లోకేష్ స్టేట్మెంట్ చూసి చంద్రబాబు నాయుడు 'ఆహా నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు' అని గర్విస్తాడా...లేక..... అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నిన్నటికి నిన్న బ్రాహ్మణి పేరు తీసుకు వచ్చి రాజకీయాల్లో లేని మీ ఆవిడను నీ చేతగాని మాటలతో ఎందుకు ఈ గొడవలోకి లాగుతావు అంటూ చురకలు అంటించిన విజయసాయిరెడ్డి ప్రజా వేదిక కూల్చివేత జరిగి ఏడాది అని టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ పై మండిపడ్డారు.

తేదీ గుర్తు పెట్టుకుని మరీ శోకాలు పెడుతున్నారు

తేదీ గుర్తు పెట్టుకుని మరీ శోకాలు పెడుతున్నారు

ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాబట్టే ప్రభుత్వం కూల్చేసింది అని పేర్కొన్న విజయసాయిరెడ్డి అదేదో మీ సొంత ఇళ్లు నేలమట్టం చేసినట్టు సంవత్సరీకాలు జరుపుకోవడం ఏమిటి ఉమా అంటూ టిడిపి నేతలపై మండిపడ్డారు. ఇక అంతే కాదు మీ ప్రభుత్వ అవినీతికి చిహ్నం ఆ రేకుల షెడ్డు అందుకే తేదీని గుర్తు పెట్టుకుని మరీ శోకాలు పెడుతున్నారు అంటూ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజలకు ఏదైనా సేవ చేయండయ్యా అంతా హర్షిస్తారు అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా హితవు పలికారు.

  Raghurama Krishnam Raju ఎపిసోడ్ తో BJP లో చీలికలు!! || Oneindia Telugu
  ఏదైనా చేతల్లో చూపిస్తారు వైఎస్ జగన్

  ఏదైనా చేతల్లో చూపిస్తారు వైఎస్ జగన్

  ఇక మరో పోస్ట్ లో మాటల కంటే చేతలు ముఖ్యం. ఇక అదే విషయాన్ని వైయస్ జగన్ నిజం చేశారు అని విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఏపీలో 3800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి అపోలో టైర్స్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది కార్పోరేట్ ప్రపంచానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న నమ్మకం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో పరిశ్రమలు పెట్టడం సులభమని చెప్పిన వైఎస్ జగన్ ప్రకటనలు పేపర్లకు పరిమితం కాలేదని, ఆయన చెప్పిన మాటలు నిజమని చూపించాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

  English summary
  YSRCP Rajya Sabha MP Vijaya Sai Reddy sarcasm on chandrababu and lokesh. said that if praja vedika demolition is not your own house demolition. then why are you crying for that. please do any work for the people he suggested . he also made interesting comments on atchannaidu .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more