• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు మాటలు తుపాకీ రాముడి కోతలు, సుంఠ నక్క చినబాబు లోకేష్ సాయిరెడ్డి వ్యంగ్యం

|

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ వ్యాఖ్యలకు, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాబందు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు . శాశ్వత ఉద్యోగం వల్ల భద్రత దొరికి ధిక్కరిస్తారని ఒప్పంద ఉద్యోగాలను తీసుకొచ్చారని, జగన్ దానికి చక్క దిద్దుతున్నారు అని పేర్కొన్నారు.

పిచ్చి కుక్కలు , గజ్జి కుక్కలు కరిచేంత ధైర్యం లేకున్నా చికాకు పెడుతుంటాయి

పిచ్చి కుక్కలు , గజ్జి కుక్కలు కరిచేంత ధైర్యం లేకున్నా చికాకు పెడుతుంటాయి

నష్టాల్లో ఉన్న 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లోకి తీసుకు రావడం మామూలు విషయం కాదు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో పెంపుడు జాగిలాలు పద్ధతిగానే ఉన్న వీధుల్లోని గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు అరుస్తూ నిద్ర చెడగొడుతుంటాయి .కరిచేంత ధైర్యం లేకున్నా చికాకు పెడుతుంటాయి అంటూ టిడిపి నాయకులను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మున్సిపల్ సిబ్బంది వాటిని వ్యాన్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి వదిలిన తర్వాత వాటి గోల తగ్గిస్తాయి అంటూ ఇటీవల టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ రివర్స్ ఎటాక్ చేశారు విజయసాయిరెడ్డి.

 పిట్టలదొర మాటలు ఎలా ఉంటాయంటే

పిట్టలదొర మాటలు ఎలా ఉంటాయంటే


అంతేకాదు పిట్టలదొర మాటలు ఎలా ఉంటాయంటే తన పెళ్ళికి అమెరికా, రష్యా అధ్యక్షులతో పాటు, ప్రపంచ దేశాల ప్రముఖులను ఆహ్వానిస్తే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విమానాలు దిగే ఖాళీ లేక ఆకాశం నుంచి అక్షింతలు చల్లి పోయారని నవ్వులు పూయిస్తారు. బాబు మాటలు తుపాకీ రాముడు కోతలకు ఏ మాత్రం తగ్గవు అంటూ సెటైర్లు వేశారు. ఇక గుంటనక్క కడుపున పుట్టిన సుంఠ నక్క చిన్న బాబు అంటూ లోకేష్ ను టార్గెట్ చేశాడు విజయసాయిరెడ్డి .

ఇంతకంటే వర్ణన అనవసరం మీ బతుకుల గురించి

ఇంతకంటే వర్ణన అనవసరం మీ బతుకుల గురించి

నక్కల బతుకు ఎలా ఉంటుందంటే సింహాలు, పులులు తిని వదిలిన కళేబరాలను ఆరగిస్తాయి. వాటికి సొంతంగా వేటాడే శక్తి ఉండదు. ఎవరో పెట్టిన పార్టీని ఆక్రమించుకొని అనుభవించినట్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకంటే వర్ణన అనవసరం మీ బతుకుల గురించి అంటూ చంద్రబాబును , నారా లోకేష్ ను తిట్టిపోశారు విజయసాయిరెడ్డి .ఏ చిన్న విషయం పై అయినా సోషల్ మీడియా వేదికగానే విజయసాయిరెడ్డి చెలరేగిపోతున్నారు . చంద్రబాబును, టీడీపీ నేతలను ఆడేసుకుంటున్నారు.

  Telangana Police 24/7 On Duty.. సిటీ అంతా CCTV - Talasani Srinivas Yadav
  English summary
  YCP Rajya Sabha member Vijayasai Reddy is setting fire to TDP chief Chandrababu Naidu and Nara Lokesh. Vijayasai Reddy, who countered Lokesh's comments on the social media platform, was outraged that the vulture Chandrababu had introduced the contract employment system. Nara Lokesh also compared with fox.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X