• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిడ్నాప్ టీడీపీ ఆర్ట్ , వీళ్ళు బాబుకు కట్టు బానిసలు ; అయ్యన్నా.. ఈ చిల్లర వేషాలు మానవా? సాయిరెడ్డి ధ్వజం

|

నిత్యం చంద్రబాబు నాయుడిని, టిడిపి నాయకులను టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మరోమారు టిడిపిని టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయిన విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎలాంటి ఆందోళనలు చేసినా, వాటిని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోని సంఘటనలను, ప్రస్తుత టీడీపీ ఆందోళనలను లింక్ పెట్టి సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు . ఈ క్రమంలో టీడీపీ నేతలు కిడ్నాప్ లు చెయ్యటంలో దిట్టలని, జగనన్న కాలనీలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, స్కూల్స్ లో ఫీజుల విషయంలో పచ్చ మీడియా రచ్చ చేస్తుందని, చంద్రబాబు ధరల పెరుగుదలపై ఢిల్లీ వెళ్ళే ధైర్యం లేక ఇక్కడ ఏదో హడావిడి చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

బాబు ఎప్పుడూ తిరస్కృతుడే ; మాలోకానికి వినిపిస్తుందా ; జాలి పడాల్సిందే అన్న సాయిరెడ్డిబాబు ఎప్పుడూ తిరస్కృతుడే ; మాలోకానికి వినిపిస్తుందా ; జాలి పడాల్సిందే అన్న సాయిరెడ్డి

జగనన్న కాలనీలను అడ్డుకునే క్రమంలో నర్సీపట్నంలో టీడీపీ హంగామా

జగనన్న కాలనీలను అడ్డుకునే క్రమంలో నర్సీపట్నంలో టీడీపీ హంగామా

జగనన్న కాలనీలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీకి అడ్రస్ ఉండదంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అందుకే వాటిని ఎలాగైనా ఆపాలని పచ్చ బాస్ పంతం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నర్సీపట్నం దగ్గర వేములపూడి లో టిడిపి కార్యకర్తల వీరంగం అందుకే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేలను చదును చేస్తున్న డ్రైవర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. రాళ్లతో దాడి చేయించడం ఏంటి అయ్యన్నా ? ఈ చిల్లర వేషాలు మానవా ? అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడే వేములపూడి దగ్గర డ్రైవర్ పై దాడి చేయించారని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న కాలనీలు పూర్తయితే టీడీపీ కి అడ్రస్ లేకుండా పోతుందని సాయి రెడ్డి తనదైన శైలిలో టీడీపీపై మండిపడ్డారు.

కిడ్నాప్ అనేది టిడిపి ఆర్టు.. ఆర్టిస్టును కూడా అరెస్టు చేస్తారా ? సెటైర్

కిడ్నాప్ అనేది టిడిపి ఆర్టు.. ఆర్టిస్టును కూడా అరెస్టు చేస్తారా ? సెటైర్

ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ నేతలందరూ కిడ్నాప్ లు చేయడంలో అంటూ కిడ్నాప్ చేయడం టిడిపి ఆర్ట్ అంటూ సైరా పంచ్ వేశారు విజయసాయిరెడ్డి. కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్, ఎన్టీఆర్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి వైస్రాయ్ హోటల్ లో దాచిన చంద్రబాబు, నవ వధువును కిడ్నాప్ చేసిన టిడిపి నేత అంటూ వివిధ పేపర్లలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ను పెట్టి కిడ్నాప్ అనేది టిడిపి ఆర్టు.. ఆర్టిస్టును కూడా అరెస్టు చేస్తారా ? అంటూ సైరా పంచ్ వేశారు.

వీళ్ళు బాబుకు కట్టు బానిసలు కాక ఇంకేమనాలి

వీళ్ళు బాబుకు కట్టు బానిసలు కాక ఇంకేమనాలి

అంతేకాదు ఇది రాష్ట్రంలో స్కూళ్లలో పరిస్థితులను మార్చడానికి, స్కూల్స్ లో ఫీజులను కట్టడి చేయడానికి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఫీజుల నియంత్రణపై పిల్లలు, పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. కార్పోరేట్ యాజమాన్యాలు నోరు మెదపలేదు. జనాలు వెంట పడతారన్న భయంతో బాబూ కిక్కురు మనడం లేదు. ప్రజలతో ఏ సంబంధం లేని అనుకుల మీడియా గోల చేయడమేంటో? వీళ్లు బాబుకు కట్టు బానిసలు కాక ఇంకేమనాలి అంటూ చంద్రబాబు అనుకూల మీడియాపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో వరుసగా పచ్చ మీడియా అంటూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియాను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.

 ఢిల్లీకి వెళ్ళే దమ్ములేక గల్లీల్లో డ్రామాలు

ఢిల్లీకి వెళ్ళే దమ్ములేక గల్లీల్లో డ్రామాలు

ఇదే సమయంలో ఈ పచ్చ పైత్యమే అంతా అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఇటీవల ధరల పెరుగుదలపై టిడిపి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలపై విరుచుకుపడ్డారు. జీవితాంతం తప్పించుకు తిరగడమే చంద్రబాబు పని. కేంద్రం అధీనంలోని ధరలపై రాష్ట్రంలో ఆందోళన చేయిస్తాడు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్ళే దమ్ములేక గల్లీల్లో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి చీకట్లో కాళ్లు పట్టుకుంటాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. అను'కుల' మీడియా వేషాలను సోషల్ మీడియా పట్టించేస్తోందని పేర్కొన్నారు.

 బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు

బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు

ఇక రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల విషయంలో సర్దుబాటు పేరుతో బాదుడుకు తెరతీశారని టిడిపినేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో,వారిపై ఎదురు దాడి చేశారు విజయసాయిరెడ్డి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నందుకు బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు అంటూ నాటి ఘటనను గుర్తు చేశారు. జనరల్ డయ్యర్ వారసుడే ఈ పచ్చాసురుడు అని నిప్పులు చెరిగారు. ఆ ఘటన జరిగి సరిగ్గా 21 ఏళ్లు. అందుకే ఇవాళ పచ్చ మంద వీధుల్లోకొచ్చి ఉత్సవాలు చేసుకున్నారు అంటూ విరుచుకుపడ్డారు. పచ్చనేతల అధర్మ పోరాటం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

ఆ తప్పుకు క్షమాపణ చెప్పు.. వీళ్ళ కడుపు మంటకు మందే లేదు

ఆ తప్పుకు క్షమాపణ చెప్పు.. వీళ్ళ కడుపు మంటకు మందే లేదు

రైతులపై నీవు జరిగిన మారణహోమానికి బషీర్ బాగ్ వెళ్లి పశ్చాత్తాపం వ్యక్తం చెయ్యి బాబు అంటూ పేర్కొన్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పొట్టని పెట్టుకున్నావు నువ్వు అంటూ నాటి తప్పుకు క్షమాపణ కోరి ముందు మనిషి అనిపించుకో అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. అంతేకాదు బాబు అధికారంలో ఉండగా ఏదైనా కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే పెట్టుబడుల వరద అంటూ బాబు కష్టానికి ఫలితం అంటూ ఎల్లో మీడియా గంతులేసేదని, ఇప్పుడు ఏదైనా సంస్థ మరెవరి వాటాలో కొనుగోలు చేస్తే అదానీప్రదేశ్ గా మారిందని ఏడుపులూ అంటూ నిప్పులు చెరిగారు. వీళ్ళ కడుపు మంటకు మందే లేదంటూ విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు.

  మంత్రి మల్లారెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేసిన రేవంత్ రెడ్డి
  English summary
  Vijayasaireddy made shocking comments aimed at Chandrababu. No matter what concerns Chandrababu has in the state, it is known that Vijayasaireddy is attacking them. Sai Reddy is breaking into the social media platform by linking past events and current TDP concerns. In the wake of this, TDP leaders have been accused of conspiring kidnappings, of conspiring to obstruct the Jagananna colonies and making the yellow media fuss over fees in schools, and also no dare to Chandrababu to go to Delhi on the rise in prices.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X