పదవీ వ్యామోహంతో భార్య గురించి అలా .. మనిషివా చంద్రబాబు: మండిపడిన సాయిరెడ్డి
వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన చంద్రబాబు ఆ పని పక్కన బెట్టి అక్కడ తన భార్యకు జరిగిన అవమానం గురించి మాట్లాడడం పై విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మనిషి అనే వాడు మారతాడు కాని, చంద్రబాబు మాత్రం మరీ దిగజారి పోతున్నాడు అంటూ నిప్పులు చెరిగారు.
చంద్రబాబుకు
అవమానం
రగడ;
అయ్యన్నపాత్రుడు,
అనితలతో
పాటు
16
మందిపై
కేసు
నమోదు

చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే వరద బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఇస్తారట
భారీ
వర్షాలు,
వరదలతో
నష్టపోయిన
బాధితులకు
రాష్ట్ర
ప్రభుత్వం
యుద్ధప్రాతిపదికన
సహాయక
చర్యలు
చేపట్టిందని
పేర్కొన్న
వైసీపీ
ఎంపీ
విజయసాయి
రెడ్డి,
మంత్రులు,
ఎమ్మెల్యేలు,
అధికారులు
వరద
ముంపు
ప్రాంతాలలో
పర్యటిస్తూ
సహాయక
చర్యలను
పర్యవేక్షిస్తున్నారు
అని
చంద్రబాబు
మాత్రం
తాను
మళ్లీ
సీఎం
అయిన
తర్వాత
బాధితులకు
25
లక్షల
రూపాయల
పరిహారం
ఇస్తానని
చెబుతున్నారని
విజయ
సాయి
రెడ్డి
ధ్వజమెత్తారు.
ఒకపక్క
ప్రభుత్వం
సహాయం
చేస్తున్నా,
చంద్రబాబు
ప్రభుత్వ
వైఫల్యం
అని
చెప్పడం
హేయమని
అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు
ప్రజల
వద్ద
సానుభూతి
కోసం
డ్రామాలు
ఆడుతున్నాడని
ధ్వజమెత్తారు.

భార్య గురించి అలా .. మనిషివా చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన జగన్ మోహన్ రెడ్డిని గాల్లో కలిసి పోతారని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడిన విజయసాయిరెడ్డి చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు చంద్రబాబును అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు తనకు అసెంబ్లీలో అవమానం జరిగిందని, తన భార్య భువనేశ్వరి పై అసెంబ్లీలో దుర్భాషలాడారని , భార్య గురించి చెప్పుకోవడంతో మనిషివా చంద్రబాబు అనే పరిస్థితి తెచ్చుకున్నాడని విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు.

పదవీ వ్యామోహంతో భార్యనే బద్నామ్
పదవీ వ్యామోహంతో ఇప్పుడు భార్యనే బద్నామ్ చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. పదవి కోసం నాడు మామను బలి చేసాడని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి అధికారమే అంతిమ లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని విమర్శించారు. తన అస్తిత్వం కోసం పరుల చావు కోరుకునేంత పదవీ కాంక్ష ఉందని విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు. సంస్కారహీనుడు, మానసిక దౌర్భల్యం, చపల చిత్తం కలిగిన చంద్రబాబుకు అధికారమే అంతిమ లక్ష్యం అన్నారు. రోజురోజుకు చంద్రబాబు దిగజారి పోతున్నారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

వరద బాధితులే తనను ఓదార్చాలి అన్నట్టు చంద్రబాబు తీరు
వరద బాధితుల వద్దకు వెళ్లి, తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలి అని అనుకుంటున్నాడని చంద్రబాబును విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక నిన్నటికి నిన్న చంద్ర బాబు బాధను దేవుడు కూడా తీర్చలేరు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఆయన ఆవేదన, రోదన ప్రజల కోసం అయితే మరోలా ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు కుప్పం ప్రజలు కూడా తిరస్కరించడంతో ఇక అధికారం అసాధ్యం అన్న సత్యం చంద్రబాబుకు బోధ పడిందని, ఇక మరోవైపు నిష్ప్రయోజకుడైన పుత్రరత్నం ఉన్నాడని నిస్పృహతోనే రోదన అంటూ చంద్రబాబు ఏడుపుకు గల కారణాలను విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. దానికి పరిష్కారం లేదంటూ వ్యాఖ్యానించారు.