తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి ఆభరణాలు బాబు ఇంట్లో?, 12గంటల్లోగా తనిఖీలు చేస్తేనే బయటపడుతాయి: విజయసాయి సంచలనం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలో దాచిన ఆభరణాలపై వివాదం మరింత ముదరుతోంది. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడీ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి రమణదీక్షితులు చేసిన ఆరోపణలు ప్రతిపక్షం వైసీపీకి అదునుగా మారాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు.

 12గంటలు దాటితే విదేశాలకు:

12గంటలు దాటితే విదేశాలకు:

12గంటల కంటే ఎక్కువ సమయం ఇస్తే.. ఆభరణాలను విదేశాలకు తరలించేస్తారని అన్నారు. కేవలం హెరిటేజ్ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టడం సాధ్యమయ్యే పని కాదన్నారు. తన కుమారుడు లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న చంద్రబాబు.. దానిపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. వేలమంది పోలీసులను పెట్టుకున్నా ప్రజల్లో వైసీపీ పట్ల ఉన్న అభిమానాన్ని చంద్రబాబు అడ్డుకోలేరన్నారు.

Recommended Video

తిరుపతి శ్రీవారి నగలు మాయం: చంద్రబాబు సమీక్ష
దీనంతటికీ చంద్రబాబే బాధ్యుడు: రమణదీక్షితులు

దీనంతటికీ చంద్రబాబే బాధ్యుడు: రమణదీక్షితులు

అంతకుముందు రమణదీక్షితులు చంద్రబాబుపై ఈ ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబునే టార్గెట్ చేశారు. శ్రీవారికి పల్లవ, చోళ రాజులు సమర్పించిన విలువైన ఆభరణాలను, ముస్లిం, విదేశీ దండయాత్రల నుంచి కాపాడేందుకు వంటగదిలో రహస్యంగా దాచి పెట్టినట్టు తమ పూర్వీకులు చెప్పేవారని ఓ జాతీయ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

ఇప్పుడు వాటిని దక్కించుకోవడం కోసం ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. బయటి వ్యక్తులకు ఇది సాధ్యమయ్యే పని కాదని టీటీడీలో తమవారిని నియమించుకుని ఈ పని జరిపించారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సీఎం చంద్రబాబే బాధ్యుడు అని పేర్కొన్నారు.

ఆలయమే కాదు.. మరికొన్ని చోట్ల..:

ఆలయమే కాదు.. మరికొన్ని చోట్ల..:


ఒక్క శ్రీవారి ఆలయమే కాదని, రాష్ట్రంలోని పురాతన కోటల్లోనూ నిధుల అన్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలు జరిపిస్తోందని రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారని, వారితోనే ఇదంతా జరుగుతోందని అన్నారు. పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి వద్ద రూ.50కోట్ల విలువైన శ్రీవారి నగలను చంద్రబాబు దాచారని ఆరోపించారు.

English summary
YSRCP Rajyasabha Member Vijayasai Reddy alleged that Lord Venkateswara ornaments are shifted to Chandrababu residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X