• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు గుంటనక్కలను ఉసిగొల్పుతున్నాడు: విజయసాయి రెడ్డి, దొంగసాయి అది తప్పంటూ బండ్ల

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్వీట్ల వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బండ్ల గణేష్ ను ఉద్దేశిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా కలుపుకుని దుయ్యబట్టారు.

గుంటనక్కలను ఉసిగొల్పడం చంద్రబాబుకు అలవాటే: విజయసాయి

గుంటనక్కలను ఉసిగొల్పడం చంద్రబాబుకు అలవాటే: విజయసాయి

ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంట నక్కలను ఉసిగొల్పుతున్నాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ గుంట నక్కలను ఊళలకు సంబరపడే నార్సిసిస్టిక్ జబ్బు చంద్రబాబుకి జిగురులా పట్టుకుందని విమర్శించారు. అభద్రతా భావాన్ని ఎగదోసి బుసలు కొట్టించడం, ఓటమిని గెలుపు అనుకోవడం ఈ జబ్బు లక్షణంగా ఉంటుందని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. వృద్ధాప్యంలో ఇదో దీనావస్థ అని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఉన్మాద భ్రమ అంటూ విజయసాయి విమర్శ

చంద్రబాబు ఉన్మాద భ్రమ అంటూ విజయసాయి విమర్శ

సొంతవర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ప్రకటించాడు బాబు. జగన్ 1250 ఎకరాల్లో 54,400 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తలపెడితే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది ఎవరు? ఎవరి రాజధానో ఇంతకంటే వేరే సర్టిఫికెట్లు కావాలా?. ఈదురుగాలులు వీచినప్పుడల్లా ధూళి 'రేణు'వులు ఎగిసిపడతాయి. వీటికి భయపడి ఎవరూ ఇళ్లలో కూర్చోరు. చంద్రబాబులాంటి ఉన్మాదులు దాన్నో వాయుగుండంగా ఊహించుకుని అంతా నాశనమైనట్టేనని భ్రమపడతారు. ఎగిరిన ఏ 'రేణు'వులైనా నేలరాలి క్షణకాలపు మసకను, స్వల్ప చికాకును మిగిల్చిపోతాయి అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

దొంగసాయి అంటూ బండ్ల గణేష్ విమర్శలు

దొంగసాయి అంటూ బండ్ల గణేష్ విమర్శలు

అయితే, బండ్ల గణేష్ కూడా విజయసాయిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి. ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటది.. నేను తెలుగుదేశం.. నేను చంద్రబాబు మనిషనని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడబాకా.. నాకు బతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత ఉంటది...' అని వ్యాఖ్యానించారు బండ్ల గణేష్.

ప్రభుత్వ సొమ్ము దోచుకుని జైలుకెళ్లడం తప్పంటూ విజయసాయిపై బండ్ల

ప్రభుత్వ సొమ్ము దోచుకుని జైలుకెళ్లడం తప్పంటూ విజయసాయిపై బండ్ల

'నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి దొంగసాయి.. నేను ఎప్పటికీ తెలుగుదేశం కాదు, నేను వైయస్ రాజశేఖర్రెడ్డి అభిమానిని అది నిజమో కాదో కావాలంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు కెవిపిని అడిగి తెలుసుకో.. దొంగసాయి.. నేను ఏపార్టీయో ఆయన చెబుతారు దొంగ సాయి. చంద్రబాబు నా బాసా..? నాకు నీతి నియమం ఉంది.. నీలాగా కాదు దొంగ సాయి. నేను ఎప్పటికీ తెలుగుదేశం అభ్యర్థిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడుకి నాకు సంబంధం లేదు దొంగ సాయి గుర్తుపెట్టుకో..?
జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవటం అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు గుర్తు పెట్టికో దొంగ సాయి అంటూ బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
Vijayasai Reddy slams chandrababu and bandla ganesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X