కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయసాయిరెడ్డి అల్లుడు చెప్పిందే బీసీజీ రాసిచ్చింది, ఏదీ చెబితే అదే కన్సల్టెన్సీ ఇస్తోంది: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదిక తప్పుల తడక అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెబితే కమిటీ నివేదిక రాసిచ్చిందని ఆరోపించారు. జీఎన్ రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్‌ను నివేదిక రాసి ఇచ్చిందని వీడియోలో చంద్రబాబు ప్రదర్శించారు. బీసీజీ.. కన్సల్టెంట్ కమిటీ. ఏదీ ఇవ్వమని చెబితే, నివేదిక ఎలా ఇవ్వమని కోరితే అలా ఇస్తోందన్నారు చంద్రబాబు నాయుడు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

 ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజం ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజం

ఏదీ చెబితే.. అదీ

ఏదీ చెబితే.. అదీ

గతంలో ఇలాంటి కన్సల్టెంట్ తప్పుడు నివేదికలు కూడా ఇచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ సొంత పనుల కోసం సీడబ్ల్యూసీ, ఇతర కార్యకలపాల కోసం తప్పుడు నివేదికలు తీసుకొని జైలుకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. వారంలో ఇవ్వమంటే వారంలో, మూడురోజులో కావాలంటే మూడురోజుల్లో.. ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని చెప్పారు.

ఏ అధికారంతో వేశారు

ఏ అధికారంతో వేశారు

నవ్యాంధ్ర రాజధాని కోసం కమిటీ వేసే హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడిది అని చంద్రబాబు ప్రశ్నించారు. విజభన చట్టం ప్రకారం శివరామకృష్ణ కమిటీ నివేదిక అందజేసిందని పేర్కొన్నారు. దానిని కాదని జీఎన్ రావు, బీసీజీ కమిటీలు వేసి.. దీనికి అనుంబంధంగా హై పవర్ కమిటీ వేయడం ఏంటి అని మండిపడ్డారు.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్, జగన్

మేనిఫెస్టో కమిటీ చైర్మన్, జగన్


ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తాము రాజధానిని మార్చబోమని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. అమరావతి రాజధానిని మార్చబోమని, ప్రచారాలు కట్టిపెట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానిక మరో ప్రాంతానికి చిచ్చుపెట్టేలా వ్యవహరించబోమని జగన్ అన్న వీడియోను కూడా ప్రదర్శించారు. 30 వేల ఎకరాలకు తక్కువ లేకుండా చూడాలని జగన్ సూచించారు.

ఇవీ సిఫారసులు

ఇవీ సిఫారసులు


శివరామకృష్ణ కమిటీ సిఫారసులను చంద్రబాబు మరోసారి వివరించారు. రాజధానిపై విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణంలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఆయా ప్రాంతాలను నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. రిస్క్, కనెక్టివిట్, వాటర్, ల్యాండ్ పేరుతో అంచనా వేశారు. విజయవాడలో రిస్క్ పాయింట్ ఐదు, వాటర్ 1.61, ల్యాండ్ మైనస్ ఆరుగా ఇచ్చారని తెలిపారు. మొత్తంగా 1.39 అందజేశారని తెలిపారు.

విశాఖలో ఇలా

విశాఖలో ఇలా

విశాఖపట్టణంలో అయితే రిస్క్ 2.86, కనెక్టివిటి మైనస్ 1.24, వాటర్ పాయింట్ 1.4, ల్యాండ్ 1.74గా పేర్కొన్నారు. భూమి ఉందని తెలిపారని చెప్పారు. మొత్తంగా 1.09గా ఇచ్చారు. గుంటూరులో రిస్క్ పాయింట్ 5.5, కనెక్టివిట్ పాయింట్ 4.9, వాటర్ మైనస్ 0.1, ల్యాండ్ మైనస్ 3.4గా ఉందని గుర్తుచేశారు. ఈ మూడు నగరాల్లో విజయవాడ శివరామకృష్ణ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు.

English summary
vijayasai reddy son-law rohith back in bcj committee tdp chief chandrababu naidu alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X