• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్తమానం లేదు.. భవిష్యత్తు లేదు.. చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు : విజయసాయి వ్యంగ్యం

|

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, లోకేష్ నే కాకుండా టిడిపి నేతలను సైతం టార్గెట్ చేసి టీడీపీ నేతలు పదిమంది మాట్లాడితే ఆయన ఒక్కడే సమాధానం ఇస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీని తూర్పారబడుతున్నాడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

ట్రైలర్ కే కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు ..చిట్టి మాలోకం చిన్నమెదడు చితికి ఇలా : విజయసాయి వ్యంగ్యంట్రైలర్ కే కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు ..చిట్టి మాలోకం చిన్నమెదడు చితికి ఇలా : విజయసాయి వ్యంగ్యం

తనపై తనకే బాబుకు నమ్మకం లేదు

తనపై తనకే బాబుకు నమ్మకం లేదు

తాజాగా చరిత్ర పుస్తకాల్లో చిరిగిన కాగితం చంద్రబాబు అంటూ, చంద్రబాబుకు వర్తమానం లేదు భవిష్యత్తు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తనకు నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం చెయ్యగలడు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు తప్పును సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు.ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు అని ట్వీట్ చేసారు విజయసాయిరెడ్డి.

 బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారుచేశాను అన్నాడట

బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారుచేశాను అన్నాడట

అంతేకాదు వాస్తవాలు చెబుతున్నా ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట ..తెలుగుదేశం పార్టీ నేతలకు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు అంటూ విమర్శలు గుప్పించారు.చంద్రబాబు హయాంలో నిర్మించిన ఇళ్ల గురించి సెటైర్లు వేశారు. "లచ్చల్ లచ్చల్ ఖర్చు చేసి తామే ఇళ్ళు నిర్మించేశాం .. పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు సిబీఎన్. నువ్వు ఇళ్ళు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబు ? లేని నగరాన్ని గ్రాఫిక్స్ లో సృష్టించి వాటాలు పంచినోడివి... బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారుచేశాను అన్నాడట" అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని తన వ్యాఖ్యల ద్వారా పేర్కొన్నారు విజయసాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకువస్తే ఉమా ఊచలు లెక్క పెట్టాల్సిందే

ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకువస్తే ఉమా ఊచలు లెక్క పెట్టాల్సిందే

దేవినేని ఉమాని కూడా టార్గెట్ చేసిన విజయసాయి ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ పోస్ట్ చేశారు. మాజీ సీఎం, మాజీ మంత్రి అయిన ఎవరు తప్పించుకోలేరు. దాచుకోవడాలు , పంచుకోవడాలు మీతోనే పోతాయి అంటూ విజయసాయి రెడ్డి పదే పదే టిడిపి నేతలు గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కచ్చితంగా ఎవరైనా చేసిన అవినీతి బయటపడితే ఊచలు లెక్క పెడతారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

  YSR 71st Birth Anniversary: ప్రజల గుండెల్లో మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి
  టిక్ టాక్ లేనిలోటు చిట్టి నాయుడు తీరుస్తున్నాడు

  టిక్ టాక్ లేనిలోటు చిట్టి నాయుడు తీరుస్తున్నాడు

  చిట్టినాయుడు అంటూ లోకేష్ ని టార్గెట్ చేసిన విజయసాయి తాను ట్వీట్ చేస్తే వైయస్సార్సీపి వణికి పోతుంది అంటున్నాడు చిట్టి నాయుడు. జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు చిట్టినాయుడు తీరుస్తున్నాడు అంటున్నారు. అంతేకాదు తిండి ఖర్చు ల గురించి ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని విజయ సాయి వ్యాఖ్యానించారు. ఏం చేసినా చిట్టి నాయుడు స్టైలే వేరు అని పేర్కొన్నారు. అన్నట్టు కొల్లు రవీంద్రను పరామర్శించావా .. మర్చిపోయావా చిట్టి అంటూ లోకేష్ పరామర్శ ప్రయాణాన్ని గురించి ప్రస్తావించారు విజయసాయిరెడ్డి .

  English summary
  Vijayasaray Reddy tweeted, that Chandrababu who is a torn paper in the history books, made sensational remarks that Chandrababu has no present and no future. Vijayasaray Reddy said that a man who has lost confidence in him can't do anything for the party line.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X