• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు గుడ్డి విజనరీ ..జగన్ సైకో ప్రిజనరీ : విజయసాయి, అయ్యన్నల మాటల యుద్ధం

|

ఏపీలో ఇళ్ల స్థలాల విషయంలో మొదలైన రగడ టిడిపి వైసిపి నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇవ్వాలని తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని టిడిపి అడ్డుకుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక టీడీపీ కూడా వాటిని ధీటుగా తిప్పి కొడుతూ అధికార పార్టీపై ఎదురు దాడికి దిగుతుంది.

టీడీపీ మిడతలదండు బీజేపీ వైపు ..డేంజర్ లో బీజేపీ..మోకా హత్యపై విజయసాయి సైరాపంచ్

ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వల్లే అవరోధాలు

ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వల్లే అవరోధాలు

న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా జూలై 8 న వైయస్ఆర్ జయంతి సందర్భంగా జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీకి అవరోధాలు కల్పించారని, అయినా సరే ఆగస్టు 15వ తేదీన కచ్చితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసి తీరుతామని వైసీపీ నేతలు చెప్పిన విషయం తెలిసిందే.ఓ పక్క టిడిపి నేతలను నిరుపేదలకు అందించే భూములను ఇవ్వకుండా అడ్డుకుంటున్న రాక్షసులుగా వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు.

వైసీపీ విమర్శలపై టీడీపీ ఎదురు దాడి

వైసీపీ విమర్శలపై టీడీపీ ఎదురు దాడి

ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా వైసిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నివాసముంటున్న నిరుపేదల వద్దనుండి భూములను లాక్కొని మళ్లీ నిరుపేదలకు ఇస్తామని చెప్పడం దారుణం అని అంటున్నారు.అంతేకాదు టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్ల పంపిణీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు.

30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు .. ఇంకెంత దిగజారతావు బాబూ ?

30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు .. ఇంకెంత దిగజారతావు బాబూ ?

ప్రతిపక్ష టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుడ్డి విజనరీ అంటూ మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే నిరసనకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు చేస్తున్నాడు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లును అడ్డుకోవడం కూడా ఆయన పనే. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం..ఇంకెంత దిగజారతావు బాబూ ?2024 లో నీ అడ్రస్ గల్లంతే అంటూ పోస్ట్ చేశారు.

జగన్ పారదర్శకత కు పచ్చ బ్యాచ్ నోళ్ళు మూతపడ్డాయి

జగన్ పారదర్శకత కు పచ్చ బ్యాచ్ నోళ్ళు మూతపడ్డాయి

అంతేకాదు మరోపోస్ట్ లో విశాఖ గ్యాస్ లీక్ కేసు లో హైపర్ కమిటీ నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్ళు మూతపడ్డాయి అంటూ వ్యాఖ్యానించారు. తొలి పాలిమర్స్ కంపెనీ తప్పని నిపుణులు తేల్చారు అని తప్పు ఎవరు చేసినా, మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని సీఎం జగన్ అన్నారని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన సూచనలు తప్పక పాటిస్తారు కాబట్టే పారదర్శకంగా నివేదికను జనం ముందుంచారు జగన్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ ను సైకో ప్రిజనరీ అని అయ్యన్న పాత్రుడు రివర్స్ ఎటాక్

జగన్ ను సైకో ప్రిజనరీ అని అయ్యన్న పాత్రుడు రివర్స్ ఎటాక్

ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును గుడ్డి విజనరీ అన్నందుకు, జగన్ ను సైకో ప్రిజనరీ అని రివర్స్ ఎటాక్ ఇచ్చారు. వైయస్సార్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశాడు సైకో ప్రిజనరీ .. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాల అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డూరంగా ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడని అయ్యన్న కౌంటర్

ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడని అయ్యన్న కౌంటర్

అంతేకాదు ఇళ్ల పట్టాలు అమ్మకం, డబుల్ రేట్లకు స్థలాలు కొనడం, అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడు అంటూ అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలోనే విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కొత్త కొత్త పదాలతో,పంచ్ లతో రోజురోజుకు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.

English summary
YCP MP Vijayasai Reddy who has set fire to the opposition TDP, especially Chandrababu Naidu, has been fired for being the blind visionary. tdp senior leader ayyanna pathrudu gave reverse counter to vijayasai reddy's post. he said that psycho prisonary has postponed the sale of house sites for the third time.he metioned jagan as psycho prisonary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more