అసమర్దుడైన పుత్రరత్నం కోసం 40 ఇయర్స్ ఇండస్టీ ఉన్మాద ధ్వంసరచన : చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడంలో విజయసాయిరెడ్డి తర్వాతే ఎవరైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి తాజాగా అసమర్ధుడైన పుత్రరత్నం కోసం చంద్రబాబు ఉన్మాద చర్యలకు దిగుతున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఏపీ లో జరుగుతున్న విగ్రహ విధ్వంసం ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందని విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా సంచలన విమర్శలు చేశారు .
జగన్ చెప్పారంటే చేస్తారంతే ... ఏపీ సీఎం కు మంత్రి పేర్ని నానీ, ఎంపీ విజయసాయిరెడ్డి కితాబు

రాష్ట్రంలో కొట్లాటలు పెట్టటం మాని, సూచనలు చెయ్ చంద్రబాబు
ప్రభుత్వ పథకాలు ఏవైనా లోపాలు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం అటువంటివి ఏవీ కనిపించకపోవడంతో విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొట్లాటలు పెట్టటం మాని, తగిన సూచనలు ఇస్తే సీఎం జగన్ తప్పకుండా స్వీకరిస్తారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం అల్లర్లకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే విగారహాల ధ్వంసం కొనసాగుతుందని విమర్శించారు .

చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి , నిస్సిగ్గుగా ఉన్మాద చర్యలు
ఇక ఇదే సమయంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని అంటూ, నిస్సిగ్గుగా ఉన్మాద చర్యలకు దిగుతున్నారు అంటూ మండిపడిన విజయసాయిరెడ్డి కుట్రలకు పాల్పడితే తప్పించుకోలేరు, చట్టం వదిలిపెట్టదు అని హెచ్చరించారు. ముందుకు సాగడం ప్రకృతి నియమం కానీ మధ్యయుగాల నాటి ఉన్మాద మనస్తత్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనుకబడి పోయానని, ఒంటరిగా మిగిలి పోయానని తొందర్లోనే తెలుస్తుంది అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబునుద్దేశించి పోస్ట్ చేశారు .

14 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఏం చెప్పారంటే
ఇక అసమర్థుడైన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచన కైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడని విజయసాయి విమర్శించారు. 14 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికి ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు . మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసెయ్ బాబు అంటూ విజయసాయి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పదునైన విమర్శనాస్త్రాలను సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఇదంతా చంద్రబాబు కుట్రనేనని అభివర్ణించారు.
మతంపై తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఓ మతానికి అనుకూలం అంటూ చంద్రబాబు ముసుగు తొలగిపోయిందని విజయసాయి పేర్కొన్నారు.