వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ టార్గెట్ గా చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ అంటూ విజయసాయి విమర్శలు .. మళ్ళీ మొదలెట్టేశారుగా !!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న భావన ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఏపీ ప్రజలకు కలిగింది. దీంతో మొదలైన రాజకీయదుమారం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఒకపక్క రాజధాని రైతులు రాజధాని తరలింపు విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఆందోళన బాట పట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.ఆయన రాజధాని కోసం పోరాటం చేస్తానని చెప్పారు. ఇక రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుతో విజయసాయి పవన్ ను టార్గెట్ చేశారు.

<strong>చిన్న ఉద్యోగులపై థర్డ్ గ్రేడ్ కుట్రలా అంటున్న చంద్రబాబు ..ఇదేనా మీ బోడి విశ్వసనీయత అంటున్న లోకేష్</strong>చిన్న ఉద్యోగులపై థర్డ్ గ్రేడ్ కుట్రలా అంటున్న చంద్రబాబు ..ఇదేనా మీ బోడి విశ్వసనీయత అంటున్న లోకేష్

రాజధాని తరలించవద్దన్న పవన్ కళ్యాణ్ ..అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని హామీ

రాజధాని తరలించవద్దన్న పవన్ కళ్యాణ్ ..అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని హామీ

రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈనెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు.
అమరావతి విషయంలో జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రతీది వ్యక్తిగతంగా చూడకూడదని జగన్ కి హితవు పలికిన పవన్ కళ్యాణ్ గత పాలకులు అవకతవకలకు పాల్పడి ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకు పోవాలి తప్ప, ఇలా పూర్తిగా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించటం కరెక్ట్ కాదన్నారు. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజధాని సమస్య ఒక ప్రాంత సమస్య కాదని, రాష్ట్రం అంతటిదీ ఈ సమస్య అని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితిలోనూ రాజధాని తరలింపును ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు.

 రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ పై యూటర్న్ మాస్టర్ అంటూ మండిపడిన విజయసాయి

రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ పై యూటర్న్ మాస్టర్ అంటూ మండిపడిన విజయసాయి

ఇక రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ పేరు ప్రస్తావించకుండా పవన్ ను ఘాటుగానే విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండా, ఆయన అమరావతిపై తన వైఖరిని మార్చుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. "చంద్రబాబు ‘అజ్ఞాత పార్ట్‌నర్‌' కూడా యూటర్నుల మాస్టర్‌ అయిపోయారని ఆయన మండిపడ్డారు. ఇక అందుకు కారణాలు కూడా చెప్పిన విజయసాయి గత ప్రభుత్వ హయాంలో నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు అంటూ నాడు పవన్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు.

 మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారని పవన్ ను టార్గెట్ చేస్తున్న విజయసాయి

మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారని పవన్ ను టార్గెట్ చేస్తున్న విజయసాయి

ఇక అంతే కాదు మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారు?" అని ఎద్దేవా చేశారు విజయ్ సాయి రెడ్డి. మొత్తానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అటు బీజేపీని, టిడిపిని మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం చర్చనీయాంశం అవుతుంది. గతంలో పదేపదే చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ అంటూ వ్యాఖ్యలు చేసి జనసేనానిని ఇబ్బంది పెట్టిన వైసిపి నేతలు ఇక రాజధాని అమరావతి విషయంలో మరోసారి పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును కలిపి విమర్శల వర్షం కురిపించడానికి వైసిపి సిద్ధమైనదని ఈ తాజా వ్యాఖ్యలతో అర్థమవుతుంది.

English summary
In the wake of the turmoil in the capital evacuation, farmers in the capital have taken aggitation to the streets. Janasena chief Pawan Kalyan demanded that he fight for the capital. Vijayasai targeted pawan on his reaction to the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X