విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోయంబేడు ఎఫెక్ట్: హాట్‌స్పాట్‌గా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్: మూసివేత..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణాజిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా విజయవాడలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. విజయవాడలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడానికి గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్ ఓ కారణంగా భావిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఈ హోల్‌సేల్ మార్కెట్ ఓ హాట్‌స్పాట్‌గా మారిందంటూ అనుమానిస్తున్నారు. ఫలితంగా ఆరు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

చెన్నై కోయంబేడు తరహాలో విజయవాడ గొల్లపూడి మార్కెట్‌‌లో కొనసాగుతోన్న వ్యాపార కార్యకలాపాల వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజూ వందలాది మంది సందర్శించే ప్రదేశం కావడం.. ఆ సమయంలో కనీస ముందు జాగ్రత్తలను పాటించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి చర్యల వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమౌతోందని అభిప్రాయపడుతున్నారు.

Vijayawada Gollapudi market to observe lockdown after increasing Covid posiThe wholesale market in Gollapudi is going to observe lockdown for a week starting from Monday in view of increasing cases of COVID-19. The market body and traders have taken the decision recently following increase incidence of cases in and around the market area. విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్ మూసివేత: కరోనా పాజిటివ్ కేసుల ఎఫెక్ట్:

మార్కెట్‌లో వ్యాపారులు గానీ, అక్కడ పనిచేస్తోన్న రోజువారీ కార్మికులు గానీ ముందు జాగ్రత్త చర్యలను పాటించట్లేదని అంటున్నారు. ఫలితంగా ఆరు రోజుల పాటు గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. శనివారం వరకూ మార్కెట్‌ను మూసివేయనున్నారు. ఆదివారం మార్కెట్‌ను పునరుద్ధరిస్తారు. అది కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండొచ్చని చెబుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితేనే మార్కెట్‌ను రోజువారీ కార్యకలాపాల కోసం పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతోపతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతో

Recommended Video

Kota Srinivasa Rao : కోట సినీ జీవితం.. యాక్టింగ్ ఇరగదీసిన సినిమాలు ఇవే ! || Oneindia Telugu

హోల్‌సేల్ మార్కెట్‌ను ఈ ఆరు రోజుల పాటు మూసివేయడం వల్ల కొద్దిమేరకైనా సానుకూల ప్రభావం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లా సహా ఇతర ప్రాంతాలకు నిత్యం నిత్యావసరుకులను తరలిస్తుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి లారీల ద్వారా నిత్యావసర సరుకులను మార్కెట్‌కు తీసుకొస్తుంటారు. కొనుగోలుదారులతో నిత్యం కిటకిటలాడుతుండే ఈ మార్కెట్ వల్ల పొరుగు జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు.

English summary
The wholesale market in Gollapudi is going to observe lockdown for a week starting from Monday in view of increasing cases of COVID-19. The market body and traders have taken the decision recently following increase incidence of cases in and around the market area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X